ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్‌ అలర్ట్‌.. మీ ఫోన్‌ హ్యాక్‌ అవుతుందంటూ వార్నింగ్‌

MPS Mahua Moitra Shashi Tharoor Asaduddin Priyanka Chaturvedi Gets warning Apple Alert - Sakshi

న్యూఢిల్లీ: పలువురు లోక్‌సభ ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్‌ ఫోన్‌ వార్నింగ్‌ అలర్ట్‌ పంపింది. ఎంపీల యాపిల్‌ ఐడీ ఆధారంగా స్టేట్‌ స్పాన్సర్డ్‌ అటాకర్స్‌ తమ ఐఫోన్‌, ఈ-మెయిల్స్‌ హ్యాక్‌ చేస్తున్నట్లు హెచ్చరించింది.  వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మెసెజ్‌ అందుకున్న వారిలో త్రుణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, శివసేన(ఉద్దవ్‌ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఉన్నారు.

కేంద్రలోని బీజేపీ ప్రభత్వం తన ఫోన్‌, ఈ-మెయిల్‌ను హ్యక్‌ చేసేందుకు ప్రయత్నిస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈ మేరకు యాపిల్‌ సంస్థ నుంచి తన  ఫోన్‌కు వచ్చిన హెచ్చరిక మెసెజ్‌ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌లో చేశారు. ‘ప్రభుత్వం నా ఫోన్, ఈ-ఇమెయిల్‌లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని హెచ్చరిస్తూ ఆపిల్ నుంచి టెక్స్ట్, ఈ మెయిల్‌ వచ్చింది. మీ భయం నన్ను మీపై జాలిపడేలా చేస్తుంది’ అంటూ అదానీ, పీఎంవో, హోమంమంత్రి కార్యాలయాలను ఉద్ధేశిస్తూ ట్వీట్‌ చేశారు.  

అదే విధంగా శివసేన(ఉద్దవ్‌ వర్గం) రాజ్యసభ ఎంపీ, తను, మరో ముగ్గురు ఇండియా కూటమి సభ్యులకు ఈ మెసెజ్‌ అందినట్లు మహువా పేర్కొన్నారు. ఆమెకు అందిన ఈ మెసెజ్‌లో ‘హెచ్చరిక:మీ యాపిల్‌ ఐడీతో అనుసంధానించిన ఐఫోన్‌ను స్టేట్‌ స్పాన్సర్డ్‌  అటాకర్స్‌ మీ ఐఫోన్‌ను టార్గెట్‌ సేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఉంది. 

మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరరూర్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తనకు కూడా యాపిల్‌ నుంచి హెచ్చరిక సందేశం వచ్చినట్లు పేర్కొన్నారు. తన ఫోన్‌, ఈ-మెయిల్‌ లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంటూ ట్విటర్‌లో పీఎంవోను ట్యాగ్‌ చేశారు. ప్రభుత్వానికి చేయడానికి ఇంతకుమించిన ముఖ్యమైన పని మరేం లేదా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. వీరితో హైదరాబాద్‌ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సైతం ఈ హెచ్చరికను అందుకున్నారు. తనకు వచ్చిన మెసెజ్‌ను ఒవైసీ ట్విటర్‌లో పంచుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top