తప్పు ఒప్పుకుంటున్నా, మాస్క్‌ పెట్టుకుంటా

MP Home Minister Narottam Mishra Realized About His Comment - Sakshi

 మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నారోత్తమ్‌ మిశ్రా 

ఇండోర్‌ : ‘నేను ఏ ప్రజా కార్యక్రమంలోనూ మాస్క్‌ ధరించను. అందులో తప్పేముంది. నేను మాస్క్‌ వేసుకోనంతే..’ అంటూ బుధవారం నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నారోత్తమ్‌ మిశ్రా ఎట్టకేలకు తప్పు తెలుసుకున్నారు. తాను భవిష్కత్తులో ఆరోగ్య సూత్రాలను తప్పక పాటిస్తానని చెప్పారు. గురువారం ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘నేను మాస్క్‌ ధరించకపోవటం అన్నది చట్టవిరుద్ధమే. అది ప్రధాన మంత్రి సెంటిమెంట్‌కు సంబంధించి కాదనుకుంటున్నాను. నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను. అలా అన్నందుకు చింతిస్తున్నాను. నేను తప్పకుండా మాస్క్‌ ధరిస్తాను. అందరూ మాస్క్‌లు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని కోరుకుంటున్నాన’’ని పేర్కొన్నారు. ( బిహార్‌ ఎన్నికలు: మాకు 50 శాతం సీట్లు ఇవ్వండి )

కాగా, బుధవారం మీడియా ప్రతినిధులు ‘‘మీరు మాస్క్‌ ఎందుకు పెట్టుకోలేదు?’’ అని అడగ్గా.. ‘‘నేను పెట్టుకోనంతే’’ అంటూ నారోత్తమ్‌ సమాధానమిచ్చారు.  దీనిపై స్పందించిన మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ‘‘ హోంమంత్రి మాస్క్‌ పెట్టుకోనంటున్నారు.. ఆయన లాగే ప్రధాన మంత్రి, ప్రజలు నియమాలను తుంగలో తొక్కి కరోనా సమయంలో వాళ్ల ఇష్టం వచ్చినట్లు చేస్తే ఏంటి పరిస్థితి?’’ అని ప్రశ్నించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top