అంత మాత్రానికే జీవితం ముగిసినట్లు కాదు | Move Forward peacefully SC Advise To Couple In Divorce Case | Sakshi
Sakshi News home page

అంత మాత్రానికే జీవితం ముగిసినట్లు కాదు

Feb 21 2025 10:41 AM | Updated on Feb 21 2025 11:36 AM

Move Forward peacefully SC Advise To Couple In Divorce Case

న్యూఢిల్లీ: వివాహ బంధం ముగిసినంత మాత్రాన జీవితమే అయిపోయినట్లు కాదని, ముందున్న భవిష్యత్తు గురించి ఆలోచించాలని విడాకుల జంటను ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా జంటను ఉద్దేశించి జస్టిస్‌ పీబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌ నేతృత్వంలోని బెంచ్‌(SC Bench) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘‘ఈ కేసులో విడాకులు తీసుకోవాలనుకుంటున్న జంటది(Divorce Couple) చిన్నవయసే. ఇలాంటి వాళ్లకు బోలెడంత భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్గు గురించి వాళ్లు ఆలోచించుకోవాలి. వివాహ బంధం ముగిసినంత మాత్రాన..వాళ్ల జీవితాలు అయిపోయినట్లు కాదు. వాళ్లు కొత్త జీవితాలను ప్రారంభిస్తూ ముందుకు సాగాలి’’అని న్యాయమూర్తులు సూచించారు .

ఈ కేసులో వివాహం జరిగినా ఏడాదిలోపే ఆమె తిరిగి పుట్టింటికి పెళ్లడం దురదృష్టకరం.  విడాకుల తర్వాతైనా  ప్రశాతంగా జీవించండి అని ఆ జంటకు సూచించింది ధర్మాసనం.

కేసు నేపథ్యం..
2020 మే నెలలో మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన యువకుడికి, మధ్యప్రదేశ్‌కు చెందిన యువతికి వివాహం జరిగింది. అయితే అత్తింటి వేధింపులతో కొన్ని నెలలకే తిరగకముందే ఆమె పుట్టింటికి చేరింది.   భర్త, అతని కుటుంబ సభ్యులపై ఆమె ఫిర్యాదు చేసింది. బదులుగా ఆ భర్త కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు. అలా.. మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి.

అలా చేస్తే సాగదీయడమే!
వీళ్ల విడాకుల వ్యవహారం సుప్రీం కోర్టు(Supreme Court)కు చేరింది. అయితే ఇలా పోటాపోటీగా కేసులు వేయడం.. విడాకుల వ్యవహారాన్ని సాగదీయడమే అవుతుందని ఇరుపక్షాల లాయర్లతో ధర్మాసనం  వ్యాఖ్యానించింది. దీంతో కేసులు ఉపసంహరించుకుంటామని వాళ్లు తెలిపారు. అదే సమయంలో ఆ జంట కలిసి జీవించే పరిస్థితులు లేవని.. ఆర్టికల్‌ 142 ప్రకారం విస్తృత అధికారాన్ని ఉపయోగించి విడాకులు మంజూరు చేయాలని విజ్ఞప్తి  చేశారు. దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది.

వివాహ బందం కోలుకోలేని విధంగా విచ్ఛినమైతే.. ఆరు నెలలు కూడా ఆగాల్సిన అవసరం లేదు.  కొన్ని షరతులతో ఆ నిరీక్షణ గడువును ఎత్తేయొచ్చు.  ఈ కారణం కింద వారి ఆ పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం సుప్రీం కోర్టుకు సాధ్యమే.  ఇందుకు ఆర్టికల్‌ 142 కింద కోర్టుకు అధికారం ఉంటుంది

::: జనవరి 06 2025 రాజ్యాంగ ధర్మాసనం తీర్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement