వ్యాక్సిన్ల మిక్సింగ్‌ వద్దు: వీకే పాల్‌ | Mixing Of COVID Vaccines Not Protocol Yet | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్ల మిక్సింగ్‌ వద్దు: వీకే పాల్‌

Jun 1 2021 6:30 PM | Updated on Jun 1 2021 7:24 PM

Mixing Of COVID Vaccines Not Protocol Yet - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌పై ‍కేంద్రం కీలక ప్రకటన చేసింది. వ్యాక్లిన్ల మిక్సింగ్‌ ప్రోటోకాల్‌కి అనుమతి లేదని ప్రకటించింది. నీతీ అయోగ్‌ సభ్యుడు, వ్యాక్సినేషన్‌ నిపుణుల కమిటీ చైర్మన్‌ వీకే పాల్  ఈ విషయాన్ని ప్రకటించారు. వ్యాక్సిన్ల కొరత సమస్య వచ్చినప్పటి నుంచి టీకా మిక్సింగ్‌ అంశం తెరపైకి వచ్చింది.

సైడ్‌ ఎఫెక్ట్స్‌
ప్రస్తుతం మనదేశంలో కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌ టీకాలు ప్రజలకు అందించారు. దేశంలో చాలా మంది ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని కోవిడ్‌ తొలి డోస్‌ టీకాగా తీసుకున్నారు. రెండో డోసు టీకా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తొలి డోసు తీసుకున్న టీకా లభ్యత లేకపోవడంతో మరో కంపెనీ టీకాను రెండో డోసుగా తీసుకొవచ్చా ?  ‘ వ్యాక్సిన్‌ మిక్సింగ్‌’? క్షేమమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై వ్యాక్సినేషన్‌ నిపుణుల కమిటీ చైర్మన్‌ వీకే పాల్‌ స్పందించారు. ప్రస్తుతానికి టీకా మిక్సింగ్‌ని వ్యాక్సినేషన్‌ ప్రోటోకాల్‌లో చేర్చలేదని ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌ మిక్సింగ్‌ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నట్టు పరిశోధనల్లో తేలినా.. అదే స్థాయిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నట్టు గుర్తించాలన్నారు. వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై అంతర్జాతీయంగా పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని వీకే సింగ్‌ వెల్లడించారు. 

గడువు మారలేదు
ఇక మొదటి, రెండో డోసులకు సంబంధించిన గడువు విషయంలో ఎటువంటి మార్పులు లేవని వీకే సింగ్‌ స్పష్టం చేశారు. కోవీషీల్డ్‌ రెండు డోసుల మధ్య గ్యాప్‌ 12 వారాలు, కోవాగ్జిన్‌ రెండు డోసుల మధ్య గ్యాప్‌ 4 వారాలుగానే ఉందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement