అకారణంగా ఇరాన్ జైల్లో 50 రోజులు బందీగా ఉన్నాడు. సరిగ్గా విడుదలైన సమయానికి యుద్ధం రూపంలో మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. జైలు గోడల మధ్యనుంచి విడుదలైనా కూడా ఆయనకు విముక్తి లభించలేదు. దీంతో అతని సంతోషం అంతా ఆవిరై పోయింది. భయంకరమైన అనుభవంతో ఎలాగోలా ప్రాణాలు ఇండియాకు చేరుకున్నాడు. ఇంతకీ ఎవరతను? తీవ్ర ఉద్రికత్తతల మధ్య అడ్డంకులను దాటుకొని సొంతగడ్డపై ఎలా అడుగు పెట్టాడు?
ఎన్‌డీటీవీ కథనం ప్రకారం ఇరాన్‌లో 50 రోజుల జైలు జీవితం తర్వాత, విడుదలైన భారత్‌కు చెందిన కేతన్ మెహతా ఫిబ్రవరి 27న ఒక హోటల్‌కు చేరాడు. మరుసటి రోజు (ఫిబ్రవరి 28) ఆయన భారత్‌కు తిరిగి రావాల్సి ఉంది. కానీ సరిగ్గా ఆ సమయానికే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించాయి. దీనితో విమానాశ్రయాలు మూతపడ్డాయి. భారత రాయబార కార్యాలయం (Indian Embassy)ని సంప్రదిస్తే హోటల్ నుంచి బయటకు రావద్దని సూచించారు.
యుద్ధం తీవ్రం, ఉద్రిక్తతలు
కేతన్ ఉన్న హోటల్, ఇరాన్ నావిదికాదళ ప్రధాన స్థావరమైన బందర్ అబ్బాస్ రేవు పట్టణానికి కేవలం 600-700 మీటర్ల దూరంలోనే ఉంది. రోజురోజుకు యుద్ధ పరిస్థితి తీవ్రమవుతోంది. ప్రతిరోజూ 100 నుండి 200 బాంబులు పడుతుండటం, కిటికీల నుండి క్షిపణులు వర్షంలా కురవడం చూశానంటూ తన అనుభవాన్నివివరించారు. అయితే ఇండియన్ ఎంబసీ తనతో నిరంతరం సంప్రదిస్తూ తనకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.
యుద్ధం కారణంగా విమానాలు లేకపోవడంతో, 20 రోజుల తరువాత ఆయన బస్సు ద్వారా ఇరాన్ నుండి ఆర్మేనియా సరిహద్దు వరకు సుమారు 1,800 కిలోమీటర్లు ప్రయాణించారు.ఈ 18-19 గంటల ప్రయాణంలో కొండల మధ్య బాంబు పేలుళ్ల శబ్దాలు వినపడేవని, పేలుళ్ల ధాటికి బస్సు కూడా ఊగిపోయేదని ఆయన చెప్పారు. చివరకు, ఆర్మేనియా చేరుకున్న తర్వాత అక్కడి నుండి విమానంలో కేతన్ మెహతా సురక్షితంగా ఢిల్లీ సమీపంలోని తన నివాసానికి చేరుకున్నారు. జైలు కష్టాల కంటే, యుద్ధం మధ్య గడిపిన ఆ 25 రోజులు తన జీవితంలో అత్యంత భయానకమైనవని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: 30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులు
జైలుకెందుకెళ్లారు?
డిసెంబర్ 8న MT వేలియంట్ రోర్ (MT Valiant Roar) అనే చమురు ట్యాంకర్‌ను ఇరాన్ అధికారులు పట్టుకున్నారు. ఈ నౌక అక్రమ డీజిల్‌ను రవాణా చేస్తోందని ఆరోపించారు. నౌకలోని 10 మంది భారతీయ సిబ్బందిని అరెస్టు చేసి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ జైలుకు తరలించారు. అందులో కేతన్ మెహతా ఒకరు. అయితే దీనిని దుబాయ్‌కు చెందిన ప్రైమ్ ట్యాంకర్స్ LLCసంస్థ తిరస్కరించింది.
ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు


