‘నాటో’కు ట్రంప్‌ బిగ్‌షాక్‌! | Donald Trump is strongly considering pulling the US out of Nato | Sakshi
Sakshi News home page

‘నాటో’కు ట్రంప్‌ బిగ్‌షాక్‌!

Apr 1 2026 5:01 PM | Updated on Apr 1 2026 5:41 PM

Donald Trump is strongly considering pulling the US out of Nato

వాషింగ్టన్‌: నాటో భాగస్వామ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. నాటో దేశాల కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన యుద్ధ చర్యలకు నాటో దేశాలు సహకరించడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నానని బ్రిటన్ మీడియా సంస్థ డైలీ టెలిగ్రాఫ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన నాటోను ‘కాగితపు పులి’గా అభివర్ణించారు. ‘అమెరికా నాటో కూటమిలో ఉండాలా వద్దా అన్నది మళ్లీ ఆలోచించే స్థితి దాటి పోయింది. నాటో విశ్వసనీయతపై నాకు ఎప్పటినుంచో సందేహాలున్నాయి. నాటో నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. వారు కాగితపు పులి అని నాకు ఎప్పటినుంచో తెలుసు. ఆ విషయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి కూడా తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

అమెరికా నాటో నుంచి బయటకు వస్తే, అది నాటోకు భారీ దెబ్బ అవుతుంది. ప్రస్తుతం అమెరికా నాటో మొత్తం రక్షణ ఖర్చులో సుమారు 70 శాతం వంతు భారం మోస్తోంది. అలాగే అత్యధిక సైనిక శక్తి, అణు ఆయుధాలు, సాంకేతికతను అందిస్తోంది. అమెరికా లేకుండా నాటో బలహీనమై, యూరప్ భద్రతా వ్యవస్థలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement