ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు మమత : షాకింగ్‌ రియాక్షన్‌ | Mamata Banerjee Claims SIR Impacted Bengal Poll Results Top Court Responds | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు మమత : షాకింగ్‌ రియాక్షన్‌

May 11 2026 6:04 PM | Updated on May 11 2026 6:15 PM

Mamata Banerjee Claims SIR Impacted Bengal Poll Results Top Court Responds

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు , ఓటర్ల జాబితా నుండి భారీగా పేర్ల తొలగింపుపై రేగిన వివాదం సోమవారం సుప్రీంకోర్టుకు చేరింది. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా 90.8 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యంతరం వ్యక్తం చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్ల పరిష్కారంపై సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి  చేసిన వ్యాఖ్యలు  సంచలనం రేపుతున్నాయి.

2021లో తమ పార్టీ గెలుచుకుని, ఇపుడు (2026  అసెంబ్లీ  ఎన్నికల్లో) బీజేపీకి ఖాతాలో చేరిన  31 స్థానాల్లో ఈ తొలగింపు వల్ల ఓట్ల లెక్కింపుపై తీవ్ర ప్రభావం పడిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ 31 స్థానాల్లో ప్రతి దానిలోనూ తొలగించిన ఓటర్ల సంఖ్య, గత ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థుల గెలుపు మార్జిన్ కంటే ఎక్కువగా ఉందని పార్టీ ఎంపీ, సీనియర్ న్యాయవాది ల్ కళ్యాణ్ బెనర్జీ ఎత్తి చూపారు. చాలా సందర్భాల్లో ఈ సంఖ్యలు దాదాపు ఒకేలా ఉన్నాయని  కోర్టుకు వివరించారు. ఉదాహరణకు, ఒకచోట టీఎంసీ అభ్యర్థి 862 ఓట్లతో ఓడిపోగా, అక్కడ 5,000 మంది పేర్లను తొలగించారని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితా నుండి తొలగింపుపై అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్న సమయంలో, తక్కువ మెజారిటీతో ఫలితాలు ప్రభావితమై ఉంటే.. బాధితులు 'ఎలక్షన్ పిటిషన్' దాఖలు చేయవచ్చని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలను గెలుచుకుని బెంగాల్‌లో తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది. ఘుస్పైథియా'  లేదా అక్రమ చొరబాటుదారులు అంశాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకోగా, అట్టడుగు వర్గాల ఓట్లను తొలగించడానికి బీజేపీ, ఈసీ కుమ్మక్కయ్యాయని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆరోపించింది.

ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను

ఈ పిటిషన్ల పరిష్కారంపై ప్రస్తుత రేటు ప్రకారం, పెండింగ్‌లో ఉన్న లక్షలాది దరఖాస్తులను పరిష్కరించడానికి మరో నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. టీఎంసీ , బీజేపీ మధ్య ఓట్ల తేడా సుమారు 32 లక్షలు కాగా, ఓటర్ల జాబితా నుండి తొలగించినందుకు వ్యతిరేకంగా దాఖలైన 35 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్‌ బినాలే లుక్‌, స్పెషల్‌ ఏంటంటే?
ఎన్నికల సంఘం (EC) వాదన
అయితే  ఓటర్ల తొలగింపు వల్ల టీఎంసీ నష్టపోయిందన్న వాదనను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈ ఐదు స్థానాలనూ తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుందని ఈసీ వాదించింది.అత్యధికంగా ఓటర్ల తొలగింపు జరిగిన మాల్దా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో (సుజాపూర్, రఘునాథ్‌గంజ్ వంటివి) టీఎంసీయే విజయం సాధించిందని ఈసీ గణాంకాలతో వివరించింది.  కాగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో  బెంగాల్‌ రాష్ట్రంలోని 294 స్థానాలకు గాను బీజేపీ 207 స్థానాలను గెలుచుకుంది. దాదాపు 15 ఏళ్ల  మమతా బెనర్జీకోటను దెబ్బ కొట్టి, ఘన విజయాన్ని నమోదు చేసింది.  బెంగాల్‌లో తొలి ప్రభుత్వాన్ని  ఏర్పాటు  చేసింది.  

ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?

Advertisement
 
Advertisement
Advertisement