ప్రతి ఆదివారం ఈ రోడ్లకు సెలవు.. నేటి నుంచే అమలు! 

Maharashtra: 13 Roads In Mumbai To Be Kept Shut For Traffic In Sundays - Sakshi

సాక్షి ముంబై: నిత్యం వాహనాల రద్దీతో సతమతమయ్యే పాదచారులకు కొంత ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇకపై ప్రతి ఆదివారం ముంబైలోని 13 రోడ్లపై వాహనాల రాకపోకలను మూసివేసి ఆ రోడ్లకు సెల వు ప్రకటించనున్నారు. మార్చి27 ఆదివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో నేడు ముంబైలోని 13 రోడ్లను వాహనాలు తిరగకుండా మూసివేయనున్నారు. ప్రతి రోజూ వాహనాల రద్దీ తో సతమతమయ్యే పాదచారులకు కాస్త వెసులుబాటు కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ 13 రోడ్లపై ఉదయం 8 గంటల నుంచి 11 గం టల వరకు వాహనాలను అనుమతించరు. ఈ విషయంపై ట్రాఫిక్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజ్‌వర్ధన్‌ సిన్హా మాట్లాడుతూ, రోడ్లను వాహనాల రాకపోకలకు మూసివేసి, కేవలం పాదచారుల కోసం మాత్ర మే తెరిచి ఉంచుతామన్నారు. అదేవిధంగా వాహనాల కోసం ప్రత్యామ్నాయ దారుల్ని కేటాయించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రోడ్లపై ఆదివారం పిల్లలు ఆటలాడుకోవచ్చని, సీనియర్‌ సిటిజన్లు వ్యాహ్యాళికి వెళ్ళ వచ్చనీ, సైక్లింగ్, యోగా, వ్యాయామం లాంటివి రోడ్ల మీదనే చేసుకోవచ్చన్నారు. ఇక ఈ నిర్ణయంపై ముంబైకర్ల స్పందనను బట్టి మరిన్ని రోడ్లను ఆదివారం మూసివేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.  
చదవండి: కనువిందు చేసే ట్రెక్కింగ్‌.. వణుకుపుట్టించే చరిత్ర

కొత్త ప్రతిపాదనేం కాదు... 
నిర్ధారిత సమయాల్లో ప్రధాన రహదారులని మూసివేసే ప్రక్రియ బొగోటా, కొలంబియా లాంటి దేశాల్లో 1974 నుంచే అమలులో ఉంది. ఇందుకోసం ఆ దేశాల్లో ఉద్యమమే జరిగింది. ప్రజల సౌకర్యంకోసం కొన్ని కిలోమీటర్ల వరకు రోడ్లను వాహనాల కోసం మూసి ఉంచుతారు. ఆ దేశాలను స్ఫూర్తిగా తీసుకుని మన దేశంలో కూడా పలు ప్రాంతాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. నగర ప్రాముఖ్యత కలిగిన రోడ్లను వాహన కాలుష్యం లేకుండా, ప్రజల కోసం తెరిచి ఉంచడం వల్ల పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వాహనాల కోసం మూసివేసిన ఈ రోడ్లపై నడవడం, స్నేహితులతో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top