బెంగళూరులో మిస్సింగ్, తిరుపతిలో ప్రత్యక్షం 

Love Couple missing in Bengaluru, Found In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన ఓ ప్రేమజంట తిరుమలలో పెళ్లిచేసుకుని.. తిరుగు ప్రయాణంలో తిరుపతి సెంట్రల్‌ బస్టాండ్‌లో బుధవారం అనంతపురం వెళ్లేందుకు ప్లాట్‌ఫాం వద్ద ఉండగా ఆర్టీసీ సెక్యూరిటీకి అనుమానంగా కనిపించింది. దీంతో వారు ఆ జంటను విచారించారు.

తాము వివాహం చేసుకున్నట్లు చెప్పడంతో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాలిక తల్లిదండ్రులు బెంగళూరు సిటీలోని కోణనకుంటె పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టినట్లు తెలుసుకున్నారు. బాలిక వయస్సు 15, యువకుని వయస్సు 21గా వెల్లడించారు. ఈస్ట్‌ పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: (వ్యభిచారగృహం నిర్వహిస్తున్న సినీ నటుడి అరెస్ట్‌)

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top