Lok Sabha elections 2024: చాంద్‌నీ చౌక్‌ నుంచి అక్షయ్‌కుమార్‌ ? | Lok Sabha elections 2024: Akshay Kumar from Chandni Chowk | Sakshi
Sakshi News home page

Lok Sabha elections 2024: చాంద్‌నీ చౌక్‌ నుంచి అక్షయ్‌కుమార్‌ ?

Feb 27 2024 6:27 AM | Updated on Feb 27 2024 6:27 AM

Lok Sabha elections 2024: Akshay Kumar from Chandni Chowk - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చాంద్‌నీ చౌక్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగొచ్చని వార్తలొచ్చాయి. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలు అక్షయ్‌ను ఒకసారి సంప్రదించారని జాతీయ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఢిల్లీలో గతంలో గెలిచిన మొత్తం 7 లోక్‌సభ స్థానాలను తిరిగి ఈసారి కూడా దక్కించుకోవాలని కమలదళం పట్టుదలతో ఉంది. సినిమాల్లోకి రాకముందు గతంలో చాలా సంవత్సరాలు ఢిల్లీ చాంద్‌నీ చౌక్‌ ప్రాంతంలో అక్షయ్‌కుమార్‌ నివసించారు.

అందుకే స్థానికతను దృష్టిలో ఉంచుకుని అక్షయ్‌కుమార్‌ను బరిలోకి దింపితే ఎలా ఉంటుంది అని బీజేపీ లోతైన లెక్కలు వేస్తోందని సమాచారం. గడిచిన 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ అన్నిస్థానాలను స్వీప్‌ చేసింది. ఈ ఏడాది అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్‌ల మధ్య పొత్తులు కుదరడంతో మూడు స్థానాల్లో కాంగ్రెస్, 4 స్థానాల్లో ఆప్‌ బరిలో దిగాలని నిర్ణయించుకున్నాయి. దీంతో ఈ ఏడు స్థానాల్లో త్రిముఖపోరు కాస్తా ద్విముఖ పోరుగా మారింది. దీంతో అభ్యరి్థని మరింత ఆచితూచి ఎంపికచేయాలని బీజేపీ భావిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement