స్వీయ నిర్బంధంలోకి ఢిల్లీ సీఎం: ఎందుకంటే?

Kejriwal Goes Into Self Isolation After Wife Sunita Tests COVID Positive - Sakshi

అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీతకు కరోనా పాజటివ్‌ 

డిల్లీలో కరోనా విజృంభణ

ఏప్రిల్‌ 26 వరకు లాక్‌డౌన్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో రెండో దశలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజుకు 25వేలకు పైగా కేసులతో నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఏప్రిల్‌ 26 వరకు ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించింది అక్కడి ఆప్‌ సర్కార్‌. అయితే ఢిల్లీలో కరోనా మహమ్మారి పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షిస్తూ, ప్రజలకు భరోసా ఇస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వయంగా స్వీయం నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఎందుకంటే కేజ్రీవాల్‌ సతీమణి సునీత తాజాగా కోవిడ్‌-19బారిన పడ్డారు. దీంతో ఢిల్లీ సీఎం హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. (కరోనా విలయం: ఢిల్లీలో లాక్‌డౌన్‌)

కాగా కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో వారం రోజులు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఢిల్లీ ప్రజల  ఆరోగ్యం, రక్షణ కోసమే లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఢిల్లీసీఎ ప్రకటించారు. గత ఏడాది జూన్‌లో జ్వరం,  గొంతు నొప్పి లాంటి లక్షణాలతో కేజ్రీవాల్‌ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్‌  వచ్చిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top