ఫ్లైఓవర్‌ పైనుంచి కరెన్సీ నోట్లు విసిరిన వ్యక్తి.. తీసుకునేందుకు ఎగబడ్డ జనం

Bengaluru Youth Throws Currency Notes From Flyover - Sakshi

బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ఓ యువకుడు హల్‍చల్ చేశాడు. కేఆర్ మార్కెట్ ప్రాంతంలోని ఫ్లైఓవర్ పై నుంచి కరెన్సీ నోట్లు వెదజల్లాడు. దీంతో వీటిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ఫలితంగా కేఆర్ మార్కెట్ సిగ్నల్ వద్ద వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కోటు ధరించి ఫ్లై ఓవర్‌పైకి వెళ్లిన ఈ యువకుడు ఓ సంచిలో రూ.10 నోట్లు తీసుకెళ్లాడు. అనంతరం వాటిని పైనుంచి కిందకు విసిరేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు అతడి కోసం పైకి వెళ్లగా అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అతడ్ని కాసేపటికే మళ్లీ పట్టుకున్నారు. యువకుడి మతిస్తిమితం సరిగ్గా లేనట్లుందని పోలీసులు చెప్పారు.

చదవండి: మరో వివాదంలో డేరా బాబా.. తల్వార్‌తో కేక్ కట్టింగ్.. వీడియో వైరల్..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top