మరో వివాదంలో డేరా బాబా.. తల్వార్‌తో కేక్ కట్టింగ్.. వీడియో వైరల్..

Dera Baba Ram Rahim Cut Cake With Sword Viral Video - Sakshi

చండీగఢ్‌: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఇటీవలే పెరోల్‌పై విడుదలైన డేరా బాబా రామ్‌ రహీం మరో వివాదంలో చిక్కుకున్నాడు. చాలా కాలం తర్వాత జైలు జీవితం నుంచి విముక్తి లభించిన ఆనందంలో ఆయన సంబరం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పెద్ద తల్వార్‌తో కేక్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

దీంతో డేరా బాబాను జైలు నుంచి విడుదల చేసిన బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలతో పాటు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలు, అదంపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే ప్రభుత్వం ఆయనను జైలు నుంచి విడుదల చేసిందని మండిపడ్డారు. డేరా బాబా నిర్వహించిన వేడుకల్లో బీజేపీ నేతలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

సీర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారం చేసిన కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించించి సీబీఐ కోర్టు. 2017లో ఈ తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి సుంజారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు డేరా బాబా. అయితే అక్టోబర్ 2022లో 40 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన ఆయన.. మరో మూడు నెలల్లోనే మరోసారి 40 రోజుల పెరోల్‌పై విడుదల అయ్యాడు. దీంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి. డేరా బాబాపై ఓ హత్య కేసు కూడా ఉంది.
చదవండి: మెట్రోలోని ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top