కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఆగని మరణాలు | India Reports 240842 New Covid Cases In A day | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఆగని మరణాలు

May 23 2021 10:21 AM | Updated on May 23 2021 2:15 PM

India Reports 240842 New Covid Cases In A day - Sakshi

దేశంలో రెండో విడత కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. వరసగా ఏడో రోజు 3 లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు తగ్గినా.. మరణాలు ఆగడం లేదు.

సాక్షి, ఢిల్లీ: దేశంలో రెండో విడత కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. వరసగా ఏడో రోజు 3 లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు తగ్గినా.. మరణాలు ఆగడం లేదు. గత 24 గంటల్లో దేశంలో 21,23,782 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,40,842 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల్లో కరోనా బారిపడి 3,741 మంది మృతి చెందగా, ఇప్పటివరకు దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,99,266కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,55,102 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 2,34,25,467 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 28,05,399 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. భారత్‌లో ఇప్పటివరకు 32,86,07,937 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 16,04,542 మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది. దేశంలో ఇప్పటివరకు 19,50,04,184 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు.

చదవండి: లాక్‌డౌన్‌ పొడిగింపు.. ఆంక్షలు కఠినతరం 
ఢిల్లీలో మూతబడ్డ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement