వ్యాక్సిన్‌లో భారత్‌ రికార్డ్‌: ప్రపంచంలోనే తొలిస్థానం

India First place in Covid Vaccination - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి వైరస్‌ వ్యాప్తి నిరోధానికి వ్యాక్సిన్‌ పంపిణీ మొదలైంది. ప్రపంచదేశాల్లో ప్రస్తుతం వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అయితే ప్రపంచ దేశాల్లో కన్నా భారత్‌లోనే అత్యధికంగా వ్యాక్సిన్లు వేసినట్లు తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలే చెబుతున్నాయి. భారత్‌ కన్నా ముందే అమెరికా, బ్రిటన్ సహా చాలా దేశాలు టీకాలు పంపిణీ మొదలుపెట్టాయి. కానీ వాటన్నిటి కన్నా వేగంగా టీకాలు వేయడంలో భారతదేశం ముందుంది.

13 రోజుల్లో 30 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా రికార్డు సృష్టించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ డేటా చెబుతోంది. అయితే ఇదే 30 లక్షల మార్క్ చేరుకోవడానికి అమెరికాకు 18 రోజులు పట్టగా... ఇజ్రాయెల్‌కు 33 రోజులు పట్టింది. బ్రిటన్‌కు 36 రోజులు పట్టింది. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌, సీరమ్‌ తయారుచేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జనవరి 16వ తేదీన మొదలుపెట్టారు. ఆ ప్రక్రియ నిర్విరామంగా.. సజావుగా సాగుతోంది. ఈ వ్యాక్సిన్‌లతో దుష్ప్రభావం జరిగిన సంఘటనలు చాలా తక్కువగా ఉండడం హర్షించదగ్గ విషయం.

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వ్యాక్సినేషన్ పంపిణీ వేగంగా సాగుతోంది. వ్యాక్సినేషన్‌లో కర్ణాటక (2,86,089) మొదటి స్థానంలో ఉంది. అనంతరం మహారాష్ట్ర (2,20,587), రాజస్థాన్ (2,57,833), ఉత్తరప్రదేశ్ (2,94,959) ఉన్నాయి. రోజుకు సగటున 5 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1,07,20,048, మృతుల సంఖ్య 1,54,010. ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులోకి వచ్

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top