భార్య కోసం రూ. 7 కోట్లు విలువ చేసే గుడి

Husband Built Temple Worth Rs 7 Crores For His Wife - Sakshi

షాజహాన్‌ ముంతాజ్‌ ప్రేమ కోసం తాజ్‌మహల్‌ కట్టిన సంగతి అందరికీ తెలుసు. పైగా అది టూరిస్టులను ఎక్కువగా ఆకర్షించే ప్రదేశంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా నిలిచింది కూడా. దీని గురించి మనం చరిత్రలో చదివి తెలుసుకున్నాం. వాస్తవానికి నిజ జీవితంలో అలాంటివి జరగడం దాదాపుగా అసాధ్యం. కానీ ఇక్కడొక వ్యక్తి అచ్చం షాజహాన్‌ మాదిరిగా అత్యంత ఖరీదైన గుడి కట్టి తన భార్య మీద ప్రేమను చాటుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లాలోని ఓ వ్యక్తి తన భార్య మీద ప్రేమతో సుమారు రూ. 7 ​కోట్లు విలువ చేసే గుడి కట్టాడు. ఇది కూడా తాజ్‌మహల్‌ మాదిరిగానే అందంగా ఉంది. అతని పేరు ఖేత్రవాసి లెంక, వ్యాపారవేత్త. అతని భార్య బైజంతి. ఆమె సంతోషి మాత భక్తురాలు. వారికి 1992లో వివాహమైంది. పెళ్లయ్యాక ఈ గ్రామంలో సంతోషి మాతకి చిన్న గుడి కట్టాలని అనుకున్నట్లు తెలిపారు. ఐతే ఇక్కడ ఉన్న నివాసితులు కూడా ఊహించొండరు ఇక్కడ ఉన్న చిన్న సంతోషిమాత ఆలయం కాస్త ఇంత పెద్దగ ఆలయంగా మారిపోతుందని అంటున్నారు ఆ దంపతులు. ఈ గుడి కట్టడంతో తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ప్రతిష్టించిన అమ్మవారు ఈ గ్రామంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల పూజించి సంతోషి మాత ఆశీస్సులు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

తన భర్త తన కోసమే కాకుండా గ్రామస్తులందరీ కోసం ఇంత పెద్ద గుడి కట్టారని చెబుతోంది. ప్రస్తుతం బైజంతి తన భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. తాను ఈ గ్రామంలో సంతోషిమా ఆలయాన్ని నిర్మించాలనుకున్నానను, ఐతే నాభర్త నా కోరికను తీర్చాలనుకున్నాడు కాబట్టే ఇది సాధ్యమైందని అని చెప్పింది బైజంతి. తాను 2008లో ఈ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించగా.. ఇప్పటికీ ఈ ఆలయం పూర్తి స్థాయిలో సిద్ధమైందని ఖేత్రవాసి లెంక చెబుతున్నారు. ఈ ఆలయం దక్షిణ భారత శైలిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు చెన్నై నుంచి కళాకారులంతా వచ్చారని బైజంతి చెప్పుకొచ్చారు.

(చదవండి: టాయిలెట్‌లో రూ.2 కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు)

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top