హిమాచల్‌ సీఎంకు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

Himachal Pradesh CM Sukhu Shifted To AIIMS - Sakshi

ఢిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖును ఢిల్లీలోకి ఎయిమ్స్‌ తరలించారు వైద్యులు. వైద్య పరీక్షల కోసం శుక్రవారం సీఎంను ఎయిమ్స్‌కు తీసుకెళ్లినట్లు ఐజీఎమ్‌సీ సూపరింటెండెంట్‌ డాక్టర్ రాహుల్ రావు తెలిపారు. అయితే, సుఖ్విందర్‌ సింగ్‌ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబ సభ్యులు ఆయనను సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్‌ కాలేజీలో చేరారు.

ఈ సందర్బంగా డాక్టర్‌ రాహుల్‌ రావు మాట్లాడుతూ.. బుధవారం రాత్రి నుంచి అన్ని రకాల పరీక్షలు చేశాం. కడుపులో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు బయటపడింది. మరిన్ని వైద్యపరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించామని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, అన్ని నివేదికలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. ఇక, సిమ్లాలో సీఎంను పరీక్షించిన వైద్యబృందం కూడా ఆయన వెంట వెళ్లింది. 

అయితే, ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు గత కొద్దిరోజులుగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్నిసార్లు బయట ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. దానివల్లే ఆయన ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు అని సుఖు ప్రధాన మీడియా సలహాదారు వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top