Heavy Rains In Mumbai 2021: రాబోయే 48 గంటల్లో అతిభారీ వర్షాలు.. - Sakshi
Sakshi News home page

రాబోయే 48 గంటల్లో అతిభారీ వర్షాలు..

Jul 21 2021 2:11 PM | Updated on Jul 21 2021 3:08 PM

Heavy Rain Fall In Mumbai  - Sakshi

ముంబై: రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరుగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసింది. అయితే, భారీ వర్షాలతో ముంబైలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూపీలోను వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఇప్పటికే 7 గురు మృతి చెందారు. భారీ వర్షలకు వేర్వేరు ప్రాంతాల్లో అనేక భవనాలు కూలీపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement