ఎక్స్‌ట్రా పెగ్‌ కేసు కొట్టివేత | HC quashes FIR against former MLA Sanjay Patil over 'extra peg' remark on Lakshmi Hebbalkar | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ట్రా పెగ్‌ కేసు కొట్టివేత

Oct 13 2026 7:24 AM | Updated on Oct 13 2026 7:24 AM

HC quashes FIR against former MLA Sanjay Patil over 'extra peg' remark on Lakshmi Hebbalkar

కర్ణాటక: బెళగావి జిల్లాలో కాంగ్రెస్‌ మాజీ మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సంజయ్‌ పాటిల్‌పై నమోదైన కేసును హైకోర్టు రద్దు చేసింది. వివరాలు.. 2024 పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో.. లక్ష్మి హెబ్బాళ్కర్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే సంజయ్‌.. ఎక్స్‌ట్రా పెగ్‌ అని వర్ణించారు. 

బీజేపీకి మద్దతు పెరుగుతున్నందున లక్ష్మి హెబ్బాళ్కర్‌కి నిద్ర రావడం లేదు, అందువల్ల ఆమెకు ఎక్స్‌ట్రా పెగ్‌ అవసరమని ఎగతాళిగా మాట్లాడారు. దీంతో ఎమ్మెల్యేపై హీరేబాగేవాడి ఠాణాలో కేసు పెట్టారు. కేసును కొట్టివేయాలని ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించగా, ఐపీసీ సెక్షన్‌ 509 కిందకు ఈ వ్యాఖ్య రాదని ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయడంతో ఊరట దక్కింది.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement