మహారాష్ట్ర పర్భనీ జిల్లా యశ్వాడీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న హనుమాన్ మందిరం మండపం కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా శిథిలాల కింద మరో 20 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అక్కడి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


