Gujarati Girls Performing Dance: ‘పీపీఈ’ డ్యాన్స్‌ చూశారా.. భలే ఉందే!

Gujarati Girls Performing Dance in PPE Kits During Navratri in Covid Situation - Sakshi

గుజరాత్‌: కోవిడ్‌ -19 దృష్ట్యా గత కొన్నేళ్లుగా పండుగ వాతావరణం కనుమరుగవుతుందేమో అన్నట్లుగా తయారయ్యింది.  ఈ కరోనా మహమ్మారీ కారణంగా ఎవరి ఇళ్ల వద్ద వాళ్లే పండుగు చేసుకుంటున్నారు. బంధువుల సందడి, సాముహిక పూజలు, ఉత్సవాలు, ఆటపాటలతో జరిగే సంబరాలను గతేడాది నుంచే నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

(చదవండి: 9 రోజులు జగన్నాథుని ఆలయాన్ని మూసేవేయనున్నట్లు నిర్ణయం)

పైగా ఈ కరోనా మహమ్మారీ ప్రపంచదేశాలను ఇంకా పీడిస్తూనే ఉన్న నేపథ్యంలో గుజరాత్‌లోని బాలికలు ఈ దసరా పండుగను కరోనా నిబంధనలను పాటిస్తునే విన్నూతనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో  గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కి చెందిని బాలికలంతా దేవి నవరాత్రి సందర్భంగా గుజరాత్‌లో ప్రముఖంగా నిర్వహించే గర్బా(గుజరాతీ వాసుల నృత్యం) కార్యక్రమంలో పీపీఈ కిట్లు ధరించి నృత్యం చేశారు.

పైగా వారు ఒక పక్క కోవిడ్‌ నియంత్రణ ప్రజలకు అవగాహన కల్పించే విధంగానూ మరోవైపు వారి సంప్రదాయాన్ని పాటిస్తూ  విన్నూతనమైన రీతిలో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ మేరకు గర్బా కార్యక్రమ నిర్వాహకుడు కోవిడ్‌ -19 నియంత్రణ పై ప్రజలకు అవగాహన కల్పించటమే లక్క్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నాడు.

(చదవండి: ఎర్ర జెండాలనే ఎందుకు వాడుతున్నారో తెలుసా?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top