బంగారాన్ని ట్యాబ్లెట్లుగా చేసి స్మగ్లింగ్‌

Gold seized at Kozhikode Airport it's Cost Rs.53 lakshs - Sakshi

కోజికోడ్‌: బంగారం అక్రమ మార్గాల్లో రవాణా చేస్తూ పట్టుబడుతున్న కేసులు అధికంగా నమోదవుతున్నాయి. బంగారాన్ని రహాస్యంగా తరలించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ చివరకు పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా కేరళలో బంగారు స్మగ్లింగ్‌ కేసు పోలీసులను ఆశ్చర్ల్యంలో ముంచెత్తింది. బంగారాన్ని ట్యాబ్లెట్లు మాదిరిగా తయారు చేసి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు. తీరా విమానాశ్రయంలో తనిఖీల వద్ద వచ్చేసరికి అధికారులు గుర్తించారు. ఈ ఘటన కోజికోడ్‌ విమానాశ్రయంలో జరిగింది.

ఒకరు షార్జా నుంచి రాగా, మరో వ్యక్తి దుబాయ్‌ నుంచి వచ్చారు. వారు విమానాశ్రయంలోకి దిగగా వారి ప్రవర్తన అనుమానంగా కనిపించడంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పరిశీలించగా షార్జా నుంచి వచ్చిన వ్యక్తి సాక్షుల్లో ట్యాబ్లెట్లు కనిపించాయి. వాటిని పరీక్షించగా 478 గ్రాముల బంగారం కనిపించింది. మరో వ్యక్తి వద్ద నుంచి 765 గ్రాముల బంగారం సీజ్‌ చేశారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం 1.24 కిలో గ్రాములు. దాని విలువ రూ.53 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top