
ముంబై: మహానగరం ముంబైలో ఈనెల 27 నుంచి జరగబోయే గణేశుని ఉత్సవాలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గణేశుని మండపాలకు విగ్రహాలను తరలించే ‘గణపతి ఆగమన్’ అంత్యంత వేడుకగా జరుగుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఆగస్టు 27న వినాయక చవితి జరగనుండగా, ఇప్పటికే విగ్రహాలను తీసుకువచ్చి పందిళ్లలో నెలకొల్పుతున్నారు. ఈ సందర్బంగా జరుగుతున్న ఆగమన్ వేడుకలు వీధివీధినా కనిపిస్తున్నాయి. డ్రమ్స్ దరువుల మధ్య గణపతి బప్పా మోర్యా నినాదాలు మార్మోగుతున్నాయి. ముంబైలోని ప్రముఖ గణేశ్ విగ్రహ తయారీ కేంద్రాలలో ఒకటైన పరేల్ నుండి వివిధ ప్రాంతాలకు గణపతి విగ్రహాలు తరలివెళుతున్నాయి.
Ganpati Aagaman 2025
Parelcha Maharaja & Govinda #GanpatiBappaMorya pic.twitter.com/HjzyAvnaoj— मुंबई Matters™🇮🇳 (@mumbaimatterz) August 10, 2025
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే గణేశ్ నవరాత్రులు ముంబై అంతటా అత్యంత వైభవంగా జరుగుతాయి. గణేష్ ఉత్సవం 2025 దగ్గర పడుతున్నందున, మండపాల కోసం తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లకు వస్తున్న దరఖాస్తులను బృహన్ ముంబై విద్యుత్ సరఫరా అధికారులు త్వరతిగతిన క్లియర్ చేస్తున్నారు.