Promise Day In Valentine Week: ‘ప్రామిస్‌ డే’ అంటే ఏమిటి? వాలంటైన్‌ వీక్‌లో దీని ప్రాధాన్యత ఏమిటి?

Festivals Happy Promise Day 2024 - Sakshi

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ‘ప్రామిస్ డే’గా జరుపుకుంటారు. ఇది ప్రేమికుల వారంలో ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతి సంబంధానికి ఈ రోజు ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ప్రేమికులకు ‘ప్రామిస్ డే’ ఎంతో ప్రాధాన్యత కలిగినది. 

‘ప్రామిస్ డే’నాడు ప్రేమికులు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. బలహీనపడ్డ బంధాలకు తిరిగి ‍ప్రాణం పోయవచ్చు. అయితే మీరు మీ భాగస్వామికి ఎలాంటి ‍ప్రామిస్‌  చేయలి? ఈ విషయంలో ఎంత నిజాయితీగా వ్యవహరించాలి? అనేది చాలా ముఖ్యం.

ఆరోగ్యకరమైన అనుబంధాల విషయంలో మీ ఇష్టాలు, అయిష్టాలను అవతలి వ్యక్తిపై ఎట్టిపరిస్థితుల్లోనూ రుద్దకూడదు. అలా కాదని మీకు నచ్చినట్లు వ్యవహరిస్తే క్రమంగా సంబంధం బలహీనపడుతుందని గుర్తించండి. మీరు నిజాయితీగా భాగస్వామిని ప్రేమిస్తే వారు ఎలా ఉన్నారో అలానే అంగీకరించండి. ఈ ప్రామిస్ డే నాడు హృదయ పూర్వకంగా భాగస్వామికి ఇటువంటి వాగ్దానం చేయండి. నాకోసం నువ్వు మారాలని ఏనాడూ కోరనని వాగ్దానం చేయండి. గతంలో ఏమి జరిగినా, వాటిని హృదయపూర్వకంగా అంగీకరించండి.

మధురంగా ​​మాట్లాడటం, బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రేమికులు పరస్పరం ప్రపోజ్‌  చేసుకుంటారు. ప్రతి కష్టమైన మలుపులో తోడుగా ఉంటానని చెప్పుకుంటారు. ఈ హామీని ప్రతీ ఒక్కరూ నిలబెట్టుకోలేరు. అయితే దీనిని నిలబెట్టుకోవడంలోనే అసలైన ప్రామిస్‌కు అర్థం ఉంటుంది. అబద్ధం చెప్పే అలవాటు ఉంటే ఎలాంటి సంబంధమైనా కొద్దికాలానికే తెగిపోతుంది.  అబద్ధాలు వినడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే వాటిని చాలామంది అలవోకగా మాట్లాడేస్తుంటారు. ప్రామిస్ డే నాడు మీ భాగస్వామితో జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని వాగ్దానం చేయండి.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top