ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు మావోయిస్టులు మృతి | Encounter In Chattisgarh Sukma 2 Maoists Killed | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు మావోయిస్టులు మృతి

Sep 24 2024 7:34 PM | Updated on Sep 24 2024 8:00 PM

Encounter In Chattisgarh Sukma 2 Maoists Killed

రాయ్‌పూర్‌:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు,పోలీసులకు మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.సుక్మా జిల్లా కార్కగున అటవీ ప్రాంతంలో మంగళవారం(సెప్టెంబర్‌24) కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలపై తొలుత మావోయిస్టులు కాల్పులు జరిపారు.

ఈ కాల్పులకు ప్రతిగా బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు మృతిచెందారు.సోమవారమే ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలోని అబూజ్‌మడ్‌ అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement