బైడెన్ డ్రైవర్‌ నిర్బంధం.. ఎందుకంటే..? | Sakshi
Sakshi News home page

బైడెన్ డ్రైవర్‌ను నిర్బంధించిన భద్రతా సిబ్బంది..ఎందుకంటే..?

Published Sun, Sep 10 2023 12:17 PM

Driver In Biden G20 Convoy Detained Over Protocol Breach - Sakshi

ఢిల్లీ: జీ20 సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కారు డ్రైవర్‌ను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష‍్యంగా కారు డ్రైవింగ్ చేసినందుకు బైడెన్ కాన్వాయ్‌ నుంచి అతన్ని తొలగించారు. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా కారును నడిపినందుకు సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

 అధ్యక్షుడు బైడెన్  కాన్వాయ్‌లో ఓ కారు డ్రైవర్‌ తన కారును యూఏఈ అధ్యక్షుడు నివాసముండే తాజ్‌ హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ విభాగం అధికారులకు సమాచారం అందించారు. ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను ఉదయం 9:30కి బైడెన్ నివాసముండే మౌర్య హోటల్‌కు వెళ్లాల్సి ఉందని డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో లోధి ఎస్టేట్‌ వద్ద నుంచి ఓ బిజినెస్ మ్యాన్‌ను తాజ్‌ వద్ద దించాల్సి వచ్చిందని చెప్పాడు. తనకు ప్రోటోకాల్స్ గురించి తెలియదని చెప్పాడు. దీంతో ఆ డ్రైవర్ను వదిలేశారు. 

జీ20 మీటింగ్‌కు హాజరవడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం ఢిల్లీ వచ్చారు. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం శనివారం రాత్రి డిన్నర్ మీటింగ్‌కి హజరయ్యారు. ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కొద్ది క్షణాల ముందే ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. ఇటు నుంచి నేరుగా వియత్నాంకు బయలుదేరారు.  

ఇదీ చదవండి: ఢిల్లీ డిక్లరేషన్ వెనక షేర్పాల కఠోర శ్రమ

Advertisement
 
Advertisement
 
Advertisement