వాట్సాప్‌ కాల్‌ సాయంతో ప్రసవం | Doctors Use WhatsApp To Deliver Baby In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ కాల్‌ సాయంతో ప్రసవం

Published Mon, Feb 13 2023 5:50 AM | Last Updated on Mon, Feb 13 2023 5:50 AM

Doctors Use WhatsApp To Deliver Baby In Jammu And Kashmir - Sakshi

శ్రీనగర్‌: నొప్పులతో విలవిల్లాడుతున్న గర్భిణికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) సిబ్బంది వాట్సాప్‌ కాల్‌ సాయంతో సురక్షితంగా ప్రసవం చేసిన సంఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. కుప్వారా జిల్లాలోని కెరాన్‌ పీహెచ్‌సీకి నెలలు నిండి, నొప్పులు మొదలైన గర్భిణిని కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. ఎక్లామ్‌ప్సియా, ఎపిసియోటోమీతో బాధపడుతున్న ఆమెకు ప్రసవం జరగడం కష్టతరంగా మారింది.

తీవ్రంగా మంచు కురుస్తుండడంతో హెలికాప్టర్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించడం వీలు కాలేదు. దీంతో కెరాన్‌ పీహెచ్‌సీ డాక్టర్లు క్రాల్‌పొరాలోని జిల్లా ఉప ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. ఆఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ పర్వేజ్‌ వాట్సాప్‌ కాల్‌లో సూచనలు ఇస్తుండగా, కెరాన్‌ పీహెచ్‌సీ వైద్యులు మహిళకు విజయవంతంగా ప్రసవం చేశారు. ఆడ శిశువు జన్మించిందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement