దారుణం: వెంటిలేటర్‌ లేక సీనియర్‌ వైద్యుడు మృతి

Diseased healthcare system killed my husband not COVID-19 - Sakshi

50 ఏళ్లు సేవందించిన ఆసుపత్రిలోనే వెంటిటేర్‌ దొరకలేదు

దీంతో ఊపిరాడక కన్నుమూసిన సీనియర్‌  వైద్యులు

కన్నీంటి పర్యంతమైన ఆయన భార్య ,ప్రముఖ గైనకాలజిస్ట్‌

కరోనా కాదు... ఆసుపత్రి నిర్లక్ష్యమే  పొట్టనపెట్టుకుంది:రామ మిశ్రా

సాక్షి,లక్నో: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో రోజుకు  మూడున్నర లక్షలకుపైగా వణికిస్తోంది. రోజుకు రోజుకుపెరుగుతున్న బాధితులతో దేశ రాజధానిలో కరోనా ఉగ్రరూపాన్నిదాల్చింది. తీవ్ర ఆక్సిజన్‌ కొరత మృత్యు ఘంటికలను మోగిస్తోంది. అటు ఉత్తర ప్రదేశ్‌లో కరోనా కల్లోలం  కానసాగుతోంది. ఈ క్రమంలో వెంటిలేటర్‌ లభ్యంకాక  ఒక సీనియర్‌ డాక్టర్‌  ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాగ్‌రాజ్‌ ఆసుపత్రిలో 50 ఏళ్లపాటు ఎనలేని సేవలదించిన సీనియర్ సర్జన్ డాక్టర్ జెకె మిశ్రా (85) సమయానికి వెంటిలేటర్‌  అందుబాటులోకి రాక అదే ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కోవిడ్‌తో బాధపడుతున్న ఆయన భార్య, ప్రముఖ గైనకాలజిస్ట్‌ రామ మిశ్రా (80) కళ్లముందే ఆయన ప్రాణాలు విడిచారు. దీంతో మిశ్రా కుటుంబ సభ్యులతో పాటు, ఆసుపత్రి సిబ్బంది,ఇతరులు విచారంలో మునిగి పోయారు.

అలహాబాద్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ (ఎస్‌ఆర్‌ఎన్) ఆసుపత్రిని తరువాతి కాలంలో ప్రయాగ్రాజ్ అని పేరు మార్చారు. ఈ ఆసుపత్రిలో మొట్టమొదటి రెసిడెంట్ సర్జన్లలో మిశ్రా ఒకరు. ఆయన భార్య డాక్టర్ రామ మిశ్రా అధ్యాపక సభ్యురాలు.ఇద్దరు  పదవీ విరమణ చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు లేకపోవడంవల్లే తమ బంధువులను కోల్పోయామని  బాధిత కుటుంబాలు ఇప్పటికే ఆరోపణలు గుప్పించాయి. దాదాపు 50 ఏళ్లపాటు విశేష సేవలందించిన మిశ్రాకు వెంటిలేటర్‌ దొరకక ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యం  సీనియర్‌ వైద్యులుగా తమకెదురైన భయంకరమైన అనుభవాలను మీడియాతో షేర్‌ చేశారు.  (కోవిడ్‌ సంక్షోభం: సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ల సాయం)

‘‘ఆ హాస్పిటల్‌ ఆయనకు రెండో ఇల్లు... ఈ హాస్పిటల్‌ తమను కాపాడుతుందని భావించాం.. కానీ కానీ అదే తాము చేసిన  పెద్ద తప్పయిపోయింది. తీవ్ర అనారోగ్యంతో ఆక్సిజన్‌ స్థాయి లెవల్స్‌ పడిపోయి స్థితిలో  ఏప్రిల్ 13న ఆసుపత్రిక వచ్చాం..నొప్పితో బాధపడుతూ, చికిత్స కోసం ఎదురుచూస్తూ, బెడ్స్‌ దొరక్క ఒక రాత్రంతా గడిపాల్సి వచ్చిందదంటూ రామ  మిశ్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు హాస్పిటల్ సిబ్బంది మిశ్రాకోసం బెడ్‌ సమకూర్చారు. కానీ, నేను మాత్రం నేలపైనే పడుకున్నా. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు. బీపీ మానిటర్ లాంటి కనీస సౌకర్యాలు లేవు. ఆయనకు మొదటి రెండు రోజుల్లో ఇంజక్షన్లుఇచ్చారు. కానీ అవేమిటో అడిగినా చెప్పలేదు. అసలు అక్కడ రోగులను పట్టించుకునేనాధుడేలేదు.. ఈ క్రమంలో ఏప్రిల్ 16 మధ్యాహ్నం నుంచి తన భర్త పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. వెంటిలేటర్‌లో ఉంచమని వైద్యులను వేడుకున్నాను. కానీ కీలకమైన (లారింగోస్కోప్, ఎండోట్రాషియల్ (ఇటి) ట్యూబ్) పరికరాలు వెంటనే అందుబాటులో లేవు. మరోవైపు ఆయనకు విపరీతమైన దగ్గు, రక్తం పడుతోంది. క్షణ క్షణానికి పరిస్థితి విషమిస్తోంది. హాస్పిటల్ సిబ్బందిని గట్టిగా అరిచేసరికి ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే ఆయన్ను పై అంతస్తులో ఐసీయూలోకి తరలించారు.  దీంతో పరిస్థితి మరింత విషమించింది. తాను పైకి వెళ్లేసరికే ఆయన ఊపిరి ఆగిపోయిందంటూ ఆమె కన్నీంటి పర్యంతమయ్యారు.  రెండో ఆలోచన లేకుండా.. ఆదుకుంటుందనే ఆశతో ఈ ఆసుపత్రికి  వచ్చాం...కానీ ఈ ఆసుపత్రే తన భర్త ప్రాణాలను బలి తీసుకుందంటూ  ఆమె ఆవేదన వెలిబుచ్చారు.

అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం తిరస్కరించింది. 25-30 కంటే తక్కువ ఆక్సిజన్ స్థాయిలతో 500 మంది రోగులు ఉన్నారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. రోగులందరినీ కాపాడటానికి  చేయగలిగిందంతా చేస్తున్నాం.. అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయగల సామర్థ్యం తమకు ఉందని తెలిపింది. అలాగే డాక్టర్ జెకె మిశ్రా గుండెపోటుతో మరణించారని కూడా వెల్లడిండంచింది. కాగా రికార్డు స్థాయి కేసులతో దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్‌ ప్రకంపనలు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. దీంతో పలువురు వైద్యులు తమ ప్రాణాలకు తెగించి మరీ కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో అనేకమంది  వైద్యులు,ఇతర సిబ్బంది కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.

చదవండి :ఆక్సిజన్‌ కొరత: సింగపూర్‌ భారీ సాయం 
పీరియడ్స్‌ టైంలో మహిళలు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top