స్పైస్‌జెట్‌కు షాక్.. ఆంక్షలు విధించిన డీజీసీఏ | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్‌పై డీజీసీఏ ఆంక్షలు.. 50శాతమే నడాపాలని ఆదేశం

Published Wed, Jul 27 2022 5:51 PM

DGCA Ordered Spicejet To Operate With Just 50 Per Cent Flights - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. అనుమతి పొందిన విమానాల్లో 50శాతమే నడపాలని తెలిపింది. 8 వారాల పాటు ఈ ఆదేశాలను పాటించాలని పేర్కొంది. స్పైస్‌జెట్ విమానాల్లో ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు జులై 9 నుంచి 13 మధ్య స్పైస్‌జెట్‌కు చెందిన 48 విమానాల్లో 53 స్పాట్ చెక్‌లు నిర్వహించింది డీజీసీఏ. భద్రత ప్రమాణాలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపింది. నోటీసులు పంపిన మూడు రోజుల్లోనే స్పాట్ చెక్‌లు చేసింది. 

అయితే ఇటీవలి కాలంలో స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.  18 రోజుల్లోనే 8 సార్లు ఈ సంస్థకు చెందిన విమానాల్లో టెక్నికల్ సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ స్పైస్‌జెట్‌కు జులై 6న నోటీసులు పంపింది.  అంతర్గత భద్రతా పర్యవేక్షణ తక్కువగా ఉండటం,  నిర్వహణ చర్యలు లేకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది.
చదవండి: దీనికి కూడా ఫైన్ వేస్తారా? రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బండ్లో పెట్రోల్ లేదని చలాన్

Advertisement
 
Advertisement
 
Advertisement