
దేశవ్యాప్తంగా ఢిల్లీ పోలీసుల దాడులు
తెలంగాణ వాసి సహా ఐదుగురి అరెస్ట్
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో లింకులున్న ఉగ్ర మాడ్యూల్ ఒక దానిని ఢిల్లీ పోలీసులు బట్టబ యలు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో దాడులు జరిపి ఇందుకు సంబంధించి ఐదుగురిని అరె స్ట్ చేశారు. పాకిస్తాన్ హ్యాండ్లర్ ద్వారా వీరు ఆన్‌లైన్‌లో యువతను ఉగ్ర ఊబిలోకి లాగు తున్నారు. కొంత భూభాగాన్ని స్వాధీనం చేసు కుని ఖిలాఫత్ జోన్‌గా ప్రకటించడం ద్వారా భారత్‌లో జిహాద్‌ను ప్రారంభించాలన్నది వీరి ప్రణాళిక అని అదనపు పోలీస్ కమిషనర్ (స్పె షల్ సెల్) ప్రమోద్ కుష్వాహా మీడియాకు తెలి పారు.
ఘజ్వా–ఇ–హింద్ (భారత్‌పై దాడి) నినాదంతో దేశవ్యాప్తంగా హింసాత్మక కార్యక లాపాలకు పాల్పడేందుకు వీరు ప్రయత్నిస్తు న్నారన్నారు. పట్టుబడిన వారిలో రాంచీకి చెందిన అషర్ దానిష్ అలియాస్ అష్రార్ ఖురే షి(23), ముంబైకి చెందిన అఫ్తాబ్ ఖురేషి, సుఫియాన్ అబూబకర్‌లు, తెలంగాణకు చెందిన మహ్మద్ హుజైఫా, మధ్యప్రదేశ్‌కు చెందిన కమ్రాన్ ఖురేషి ఉన్నారు. వీరితోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని, విచారిస్తు న్నట్లు వివరించారు.
ఈ మాడ్యూల్‌కు డానిష్ సారథ్యం వహిస్తూ పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్ తరఫున కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఈ హ్యాండ్లకు సీఈవో, గజ్బా, ప్రొఫెసర్ అనే సంకేత నామం ఉందని ఏసీపీ కుష్వాహా చెప్పారు. సోషల్ మీడియా చాట్ల ద్వారా పాక్ హ్యాండ్లర్ వీరికి మందు పాతరల డిజైన్లు, తయారీలో సలహాలిస్తున్నాడు. గత ఆరు నెలలుగా వీరి కార్యకలాపాలపై కన్నేసి ఉంచామని, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో అఫ్తాబ్, సుఫియాన్‌లను మొదటగా అరెస్ట్ చేశామన్నారు.
మేవాడ్‌కు చెందిన వ్యక్తి నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వచ్చి వీరు పట్టుబడ్డారని తెలిపారు. వీరి మరికొంత మందిని కూడా చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ఐఈడీలను తయారు చేసేందుకు అవసరమైన వివిధ రకాల సామగ్రి, రసాయనాలను స్వాధీనం చేసుకుని, విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. ఖిలాఫత్ గతంలో పట్టుబడిన ఉగ్ర మాడ్యూల్‌లతో సంబంధం లేకుండా కొత్తగా ఏర్పాటైన గ్రూపుగా పేర్కొన్నారు. ఖిలాఫత్ జోన్‌కు అవసరమైన భూమి కొనుగోలు కోసం వీరు నిధుల సేకరణలో బిజీగా ఉన్నారన్నారు.