ఢిల్లీ మంత్రి నివాసాల్లో 23 గంటలపాటు ఈడీ సోదాలు | Delhi AAP Minister Raaj Kumar Anand House Raided By ED In Money Laundering Case - Sakshi
Sakshi News home page

Delhi ED Raids: ఢిల్లీ మంత్రి నివాసాల్లో 23 గంటలపాటు ఈడీ సోదాలు

Published Sat, Nov 4 2023 5:15 AM

Delhi Minister Raaj Kumar Anand house raided by ED - Sakshi

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఢిల్లీ సామాజిక, ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు  రాజ్‌కుమార్‌ ఆనంద్‌ నివాసాలు, కార్యాలయాల్లో 23 గంటలపాటు సోదాలు నిర్వహించారు. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం ఉదయం ముగిశాయి.

మంత్రిపై మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. ఆయన అంతర్జాతీయ హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు, తప్పుడు పత్రాలతో రూ.7 కోట్లకుపైగా పన్ను ఎగ్గొట్టినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) చార్జిïÙట్‌ దాఖలు చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు ఈడీ పరిధిలోకి వచి్చంది. తనను వేధించడమే పనిగా పెట్టుకుందని ఈడీపై మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌         మండిపడ్డారు.

Advertisement
 
Advertisement