విషాదం: రోజు వ్యవధిలో కడుపులో బిడ్డ, డాక్టర్‌ మృతి

Covid Battle Delhi Pregnant Doctor Loses Unborn Baby And Her Life - Sakshi

కన్నీరు తెప్పిస్తున్న విషాద కథనం

ఢిల్లీలో వెలుగు చూసిన హృదయవిదారక సంఘటన

న్యూఢిల్లీ: కరోనా ఎందరిని బలి తీసుకుందో.. ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేసిందో లెక్కేలేదు. చిన్నా, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తుంది. కోవిడ్‌ బారిన పడి సామాన్యులే కాదు.. వైద్య సిబ్బంది కూడా ప్రాణాలు విడుస్తున్నారు. ఎందరినో మహమ్మారి నుంచి కాపాడిన డాక్టర్లు.. చివరికి వైరస్‌ చేతిలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దేశ రాజధానిలో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. ప్రెగ్నెంట్‌ అయిన డాక్టర్‌ కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో ఆమె కడుపులోని బిడ్డ చనిపోయింది. ఆ కడుపుకోతను తట్టుకోలేకపోయిన తల్లి.. మరుసటే రోజే మరణించింది. ఇక చివరి రోజుల్లో ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు..

ఢిల్లీకి చెందిన డాక్టర్‌ డింపుల్‌ అరోరా చావ్లా అలియాస్‌ దీపిక డెంటిస్ట్‌గా పని చేస్తుండేవారు. మూడేళ్ల బాబు ఉండగా.. ప్రస్తుతం రెండోసారి గర్భం దాల్చారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 21న ఆమెకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసింది. వైద్యులు ఇచ్చిన మందులు వాడుతూ ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. కానీ పది రోజుల తర్వాత ఆమె ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడం ప్రారంభమయ్యాయి.

వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సలో భాగంగా ఆమెకు రెమిడెసివర్‌ ఇంజక్షన్‌తో పాటు రెండు సార్లు ప్లాస్మా థెరపీ కూడా చేశారు. కానీ లాభం లేకపోయింది. ఆ ఎఫెక్ట్‌ కడుపులోని బిడ్డ మీద పడింది. చిన్నారి హృదయస్పందన ఆగిపోయింది. దాంతో వైద్యులు ఆపరేషన్‌ చేసి మృత పిండాన్ని తొలగించారు. అన్ని రోజుల పాటు ధైర్యంగా ఉన్న డింపుల్‌ బిడ్డను కోల్పోవడంతో తీవ్ర మనోవేదనను అనుభవించారు. ఆ బాధ తట్టుకోలేక మరుసటి రోజే ప్రాణాలు విడిచారు. 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కోవిడ్‌ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో.. ఆరోగ్యం ఎంతలా క్షీణిస్తుందో తెలియజేప్తు ఓ వీడియో తీశారు. దీనిలో డింపుల్‌ ‘‘ఎంతో ఇబ్బంది పడుతూ ఈ వీడియో తీశాను. ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒక్కటే. కరోనాను లైట్‌ తీసుకోకండి. పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. కనీసం మాట్లాడలేకపోతున్నాను. నేను చేసే విన్నపం ఒక్కటే. మీ ఆత్మీయుల కోసమైనా మాస్క్‌ ధరించండి. ఇంట్లో కానీ బయట కానీ ఎవరితో మాట్లాడినా మాస్క్‌ ధరించే మాట్లాడండి.. ప్రాణాలు కోల్పోవడం కన్నా మాస్క్‌ ధరించడం ఎంతో ఉత్తమం’’ అని వేడుకున్నారు. 

ఇక ప్రస్తుతానికైతే మన దగ్గర గర్భవతులు, పాలిచ్చే తల్లుల మీద వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ నిర్వహించలేదు. కనుక వీరు వ్యాక్సిన్‌ తీసుకోవద్దని ప్రభుత్వం సూచించింది. ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆక్సిజన్‌ కొరతతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

చదవండి: ముంబైలో కరోనా కల్లోలం.. చేతులెత్తి మొక్కిన మేయర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-05-2021
May 12, 2021, 18:58 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 90,750 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21,452 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,44,386...
12-05-2021
May 12, 2021, 16:27 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని డాక్టర్‌ దంపతులు...
12-05-2021
May 12, 2021, 16:14 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో బయటపడిన కరోనా వైరస్‌ బి-1617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళనకరమైన స్ట్రెయిన్‌గా వర్గీకరించిందంటూ నిన్నంత...
12-05-2021
May 12, 2021, 16:13 IST
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ తండ్రి శివప్రసాద్‌ సింగ్‌ కరోనాతో పోరాడుతూ బుధవారం కన్నుమూశారు. ఆర్పీ సింగ్‌ ఐపీఎల్‌...
12-05-2021
May 12, 2021, 15:53 IST
లండన్:  గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌ అడ్డుకట్టకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని భావించి ఆయా దేశాల శాస్త్రవేత్తలు వాళ్ల ప్రయత్నాలను...
12-05-2021
May 12, 2021, 15:22 IST
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే భారత్‌ ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపింది. దానికి బదులుగా టీకా తయారీకి అవసరమైన ముడి సరుకులు...
12-05-2021
May 12, 2021, 14:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. ఆక్సిజన్‌ కొరతతో...
12-05-2021
May 12, 2021, 12:50 IST
సాక్షి, శ్రీకాకుళం: క‌రోనా వైరస్‌ బారిన ప‌డిన ఆంధ్రప్రదేశ్‌ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం దంపతులు పూర్తి చికిత్స అనంత‌రం సంపూర్ణంగా కోలుకున్నారు....
12-05-2021
May 12, 2021, 12:36 IST
సాక్షి, చెన్నై: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల...
12-05-2021
May 12, 2021, 11:48 IST
కరోనా సెకండ్‌ వేవ్‌ సెలబ్రిటీల మీద కన్నేసినట్లుంది. ఈ ఏడాది ఎంతోమంది సినీప్రముఖులకు కరోనా సోకింది. ఈ క్రమంలో పలువురూ...
12-05-2021
May 12, 2021, 11:24 IST
నాకసలు కరోనా రాలేదు. ఈ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో, ఏ ఉద్దేశ్యంతో వాటిని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ...
12-05-2021
May 12, 2021, 11:18 IST
తన భార్య ప్రమీల కరోనాని జయించడంతో పాటు చక్కని మగబిడ్డకు జన్మనిచ్చి ఇంటికి రావడంతో గణేష్‌ కుటుంబ సభ్యుల ఆనందంతో...
12-05-2021
May 12, 2021, 10:03 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగు రోజుల నుంచి కొత్త కోవిడ్‌ కేసుల...
12-05-2021
May 12, 2021, 09:47 IST
నాతో పాటు మా ఇంట్లో ఆరుగురికి కరోనా సోకింది. కరోనా సోకిన తర్వాత నా కుమారుడి పరిస్థితి ఓ సందర్భంలో కలవరపెట్టింది... ...
12-05-2021
May 12, 2021, 04:41 IST
సాక్షి, తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో రోజువారీ సహజ మరణాలపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. రెండురోజులుగా సహజంగా మరణించినవారు కూడా.....
12-05-2021
May 12, 2021, 04:34 IST
సాక్షి, అమరావతి: కరోనాతో మృతి చెందిన వారిని అయిన వాళ్లే వదిలేసినా..వారి అంత్యక్రియలను పోలీసులు అన్నీ తామై చేయిస్తూ మానవత్వం...
12-05-2021
May 12, 2021, 04:30 IST
గుడ్లవల్లేరు (గుడివాడ): ఇంటి పట్టునే ఉంటే కరోనా సోకదని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో పెదపాలెం గ్రామస్తులు అదే మాటను కట్టుబాటుగా చేసుకున్నారు....
12-05-2021
May 12, 2021, 03:46 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ చికిత్సలకు చెల్లించే ఆరోగ్యశ్రీ రేట్లను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం ఉత్తర్వులు...
12-05-2021
May 12, 2021, 03:27 IST
కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. బాధాకరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయి. నిన్న (సోమవారం రాత్రి) తిరుపతి రుయా ఆస్పత్రిలో...
12-05-2021
May 12, 2021, 03:08 IST
సాక్షి, అమరావతి: అవసరమైన మేరకు ఆక్సిజన్‌ను కేటాయించి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top