ప్రధాని అది ఆలోచించడం మానేస్తే మంచిది : కాంగ్రెస్‌ | Congress Strong Counter To Pm Modi Comments On Election Results | Sakshi
Sakshi News home page

హిమాచల్‌, కర్ణాటక ఫలితాలప్పుడు తెలియదా..?

Dec 4 2023 3:25 PM | Updated on Dec 4 2023 3:56 PM

Congress Strong Counter To Pm Modi Comments On Election Results - Sakshi

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ పార్టీ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినపుడు ప్రధాని జ్ఞానం ఎక్కడ పోయిందని కాంగ్రెస్‌ లోక్‌సభపక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేస్తే మంచిదని ప్రధానికి సూచించారు. 

కాగా, సోమవారం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడుతూ ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్‌కు మంచి అవకాశం. ఈ ఓటమి తర్వాత వాళ్లు తమ ఫ్రస్టేషన్‌ తీర్చుకోవడానికి ప్లాన్‌లు వేసే కంటే ఈ అవకాశం నుంచి వాళ్లు నేర్చుకోవాలి’ అని మోదీ సూచించారు.

‘ఈ తొమ్మిదేళ్లలో  జరిగింది వదిలేసి కనీసం ఈ సెషన్‌లోనైనా పాజిటివ్‌గా ముందుకు వెళితే ప్రజలు కాంగ్రెస్‌ పట్ల అభిప్రాయం మార్చుకునే చాన్స్‌ ఉంది. వారి కోసం కొత్త తలుపులు తెరచుకునే అవకాశం ఉంది’ అని మోదీ కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.   

తాజాగా వెలువడిన  ఐదు స్టేట్స్‌ ఎన్నికల ఫలితాల్లో ఒక్క తెలంగాణలో తప్ప రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ చేతిలో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అధికారం గ్యారెంటీ అనుకున్న ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ, కాంగ్రెస్‌కు షాకిచ్చింది.

ఇదీచదవండి..మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ అప్‌డేట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement