కరోనాపై ఉమ్మడి పోరాటం

Centre advises heightened surveillance, booster dose coverage as covid cases - Sakshi

రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పిలుపు 

అర్హులైన వారందరికీ బూస్టర్‌ డోసు ఇవ్వండి 

వైరస్‌ నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించండి 

కొత్త వేరియంట్లను గుర్తించడానికి జినోమ్‌ సీక్వెన్సింగ్‌ పెంచాలి 

పార్లమెంట్‌ ఉభయ సభల్లో మంత్రి ప్రకటన  

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మనమంతా ఇక మేల్కొనాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ చెప్పారు. అర్హులైన వారందరికీ కరోనా టీకా బూస్టర్‌ డోసు ఇవ్వాలని, మహమ్మారి నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రకటన చేశారు.

కొత్త వేరియంట్‌ మన దేశంలోకి అడుగుపెట్టే అవకాశాలను తగ్గించడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రకటించారు. విదేశీ ప్రయాణికుల నుంచి విమానాశ్రయాల్లో ర్యాండమ్‌ శాంపిల్స్‌ సేకరణ మొదలైందని తెలిపారు. ‘‘మన శత్రువు(కరోనా) కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటోంది. మనం ఇకపై మరింత పట్టుదల, అంకితభావంతో శత్రువుపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలి’’ అని పిలుపునిచ్చారు.  

ప్రజల్లో చైతన్యం పెంచాలి  
ప్రపంచమంతటా రోజువారీగా సగటున 5.87 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయని, మన దేశంలో మాత్రం సగటున 153 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాప్తి, తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుత సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాబోయే పండుగలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసు పంపిణీని వేగవంతం చేయాలని చెప్పారు. బూస్టర్‌ డోసుతోపాటు కరోనా నియంత్రణ చర్యలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని విన్నవించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తల విషయంలో ప్రజల్లో చైతన్యం పెంచాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పారు.  

ఏమరుపాటు వద్దు  
కొత్త వేరియంట్లను గుర్తించడానికి పాజిటివ్‌ కేసుల జినోమ్‌ సీక్వెన్సింగ్‌ పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు. కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్‌ నిబంధనలు‡’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరారు.

కరోనా అనే విపత్తు ఇంకా ముగిసిపోలేదు కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయడానికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై, జీవనంపై ప్రభావం చూపిస్తూనే ఉందని గుర్తుచేశారు. గత కొద్దిరోజులుగా వైరస్‌ వ్యాప్తి ఉధృతం అవుతుందోన్నారు. చైనా, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ మనదేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. అయినప్పటికీ ఏమరుపాటు తగదని స్పష్టం చేశారు.

24 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు టెస్ట్‌లు
విదేశాల నుంచి వచ్చేవారికి ఈ నెల 24వ తేదీ నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారికి ర్యాండమ్‌ కరోనా వైరస్‌ టెస్టు నిర్వహించాలంటూ పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. చాలా దేశాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి విమానంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల్లో కొందరి నుంచి ఎయిర్‌పోర్టులోనే నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరెవరికి టెస్టులు చేయాలన్నది వారు ప్రయాణించిన విమానయాన సంస్థ నిర్ణయిస్తుంది.      

ఎంపీలంతా మాస్కులు ధరించాలి: స్పీకర్‌
కరోనా వ్యాప్తిపై మళ్లీ భయాందోళనలు మొదలైన నేపథ్యంలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో çసభ్యులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా గురువారం సూచించారు. లోక్‌సభ ప్రవేశద్వారాల వద్ద మాస్కులు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎంపీలందరూ వాటిని ధరించి, సభలో అడుగపెట్టాలని కోరారు. గురువారం పార్లమెంట్‌లో చాలామంది ఎంపీలు మాస్కులు ధరించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పార్లమెంట్‌ సిబ్బందిని లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు పాటించాలన్న స్పీకర్‌ బిర్లా సూచనను పలువురు ఎంపీలు స్వాగతించారు.  

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

23-12-2022
Dec 23, 2022, 04:25 IST
సాక్షి, అమరావతి: వివిధ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు చర్యలు...
23-12-2022
Dec 23, 2022, 04:20 IST
సాక్షి, అమరావతి/డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): ఒకవేళ మన రాష్ట్రం­లో కోవిడ్‌ బీఎఫ్‌–7 వేరియంట్‌ ప్రభావం చూపితే.. సమ­ర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతా...
22-12-2022
Dec 22, 2022, 12:24 IST
న్యూఢిల్లీ: చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి దడ పట్టిస్తోంది. కోవిడ్‌ పుట్టినిల్లుగా భావించే చైనాలో ఒమిక్రాన్‌లో సబ్‌వేరియెంట్‌ ప్రస్తుతం...
22-12-2022
Dec 22, 2022, 12:07 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న...
22-12-2022
Dec 22, 2022, 11:09 IST
సాక్షి, హైదరాబాద్‌: మన దేశంలో కోవిడ్‌ ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నవన్ని ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లేనని,...
22-12-2022
Dec 22, 2022, 01:45 IST
న్యూఢిల్లీ: చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో...
22-12-2022
Dec 22, 2022, 00:16 IST
ఒకరికి తెద్దునా... ఇద్దరికి తెద్దునా... అందరికీ తెద్దునా అని జనవ్యవహారం. చైనా తప్పిదాలతో కరోనా మళ్ళీ దేశదేశాల్లో కోరలు సాచే...
21-12-2022
Dec 21, 2022, 03:36 IST
చైనాలో కోవిడ్‌–19 విశ్వరూపం చూపిస్తోంది. ప్రజా నిరసనలకు తలొగ్గి ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానాన్ని వెనక్కి తీసుకున్న దగ్గర్నుంచి కేసులు...
04-11-2022
Nov 04, 2022, 10:36 IST
British man who had COVID for 411 days is cured: దీర్ఘకాలంగా కోవిడ్‌తో బాధపడుతున్న రోగి తాజాగా వైరస్‌...
29-07-2022
Jul 29, 2022, 01:19 IST
కరోనా ఇక కాస్త మందగించిందంటూ మూడో వేవ్‌ దాటిన తర్వాత ప్రజలంతా కొద్దిగా హాయిగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో... తన...
26-07-2022
Jul 26, 2022, 03:40 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకాకు సంబంధించిన ప్రికాషన్‌ డోసు పంపిణీపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి...
15-07-2022
Jul 15, 2022, 04:30 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ కట్టడికి చేపడుతున్న టీకా ప్రక్రియలో మరో కీలక ఘట్టానికి అడుగు పడింది. దేశ వ్యాప్తంగా...
10-07-2022
Jul 10, 2022, 02:55 IST
సాక్షి, అమరావతి: కరోనా టీకా ప్రికాషన్‌ డోసు కాల వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించినట్టు రాష్ట్ర...
19-06-2022
Jun 19, 2022, 10:25 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మళ్లీ విస్తరిస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.  నిత్యం...
14-06-2022
Jun 14, 2022, 10:09 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్‌ కేసులతోపాటు యాక్టివ్‌ కేసులు సంఖ్య...
14-06-2022
Jun 14, 2022, 01:16 IST
సాక్షి, హైదరాబాద్‌: అర్హులందరికీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రికాషనరీ డోస్‌ ఇవ్వడానికి అనుమతివ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని...
14-06-2022
Jun 14, 2022, 01:11 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో కరోనా ‘ఫోర్త్‌ వేవ్‌’మొదలైందా? ప్రస్తు తం మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక...
06-06-2022
Jun 06, 2022, 06:11 IST
వానాకాలం రాకుండానే రకరకాల వైరస్‌ల భయం పట్టుకుంది. కేరళలో వెస్ట్‌నైల్, టమోటా వైరస్, మధ్యప్రదేశ్‌లో చికెన్‌పాక్స్‌ కేసులు దడపుట్టిస్తున్నాయి.  ఉత్తరప్రదేశ్‌లో...
03-06-2022
Jun 03, 2022, 10:45 IST
నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కాంటాక్ట్‌ అయినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ...
28-05-2022
May 28, 2022, 17:03 IST
కరోనా బారినపడి చికిత్స పొందుతున్నప్పుడు, తర్వాత కోలుకుంటున్న సమయంలో కూడా ఎముకల క్షయాన్ని గుర్తించారు. కరోనా వైరస్‌ సోకిన



 

Read also in:
Back to Top