Satyendar Jain: ఆప్‌ మంత్రిని విచారించిన సీబీఐ

CBI Interrogated Delhi Minister Satyendar Jain In Delhis Tihar Jail - Sakshi

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్‌ జైలులో ఉన్న ఢిల్లీ ఆప్‌ మంత్రి సత్యేందర్‌ జైన్‌ను ఎట్టకేలకు సీబీఐ విచారించింది. ఈ విషయమే విచారణ సంస్థ గత శుక్రవారమే ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ముందుకు దరఖాస్తును తరలించగా..దానికి అనుమతి కూడా లభించింది. దీంతో  కోర్టు ఆదేశాల మేరకు సెంట్రల బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) సోమవారం ఆప్‌ మంత్రి సత్యేందర్‌ జైన్‌ను విచారించినట్లు న్యాయవాది మొహ్మద్‌ ఇర్షాద్‌ తెలిపారు.

ఇదే కేసులో తీహార్‌ జైలులో ఉన్న ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌జార్జ్‌ విజయ నాయర్‌ను కూడా సీబీఐ ప్రశ్నంచిందని న్యాయవాది తెలిపారు. అయితే ఆయనకు గతంలో ఎక్సైజ్‌ స్కామ్‌లో బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. కాగా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద చేసిన దర్యాప్తులో ఢిల్లీ 2021-22 ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీని పెద్ద మొత్తంలో ప్రయోజనాలను పొందేందుకే ఆప్‌ అగ్రనేతలు రూపొందించినట్లు వెల్లడైంది.

ఈ అక్రమ నిధులు వారిమధ్య చేతులు మారినట్లు పేర్కొంది. అదీగాక మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆప్‌ మంత్రి జైన్‌ ఫిబ్రవరి 14, 2015, నుంచి మే 31, 2017 మధ్య కాలంలో తన ఆదాయానికి పొంతన లేని విధంగా ఆస్తులు సంపాదించినట్ల సీబీఐ తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top