
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శాఖ శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. రాజీవ్ గౌబా పదవీ కాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న గౌబా 2019లో కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఆయన పదవీ కాలం గత ఏడాది ఆగస్టులో ముగియగా, ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. తాజాగా మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్ర కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గౌబా జార్ఖండ్ కేడర్ అధికారి.