బరితెగించిన పాక్‌ రేంజర్స్‌ | BSF jawan killed in third ceasefire violation by Pakistan Rangers in 3 weeks | Sakshi
Sakshi News home page

బరితెగించిన పాక్‌ రేంజర్స్‌

Published Fri, Nov 10 2023 6:21 AM | Last Updated on Fri, Nov 10 2023 6:21 AM

BSF jawan killed in third ceasefire violation by Pakistan Rangers in 3 weeks - Sakshi

జమ్మూ/అరి్నయా: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్తాన్‌ రేంజర్స్‌ జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని రామ్‌గఢ్‌ సెక్టార్‌లో భారత్‌–పాక్‌ సరిహద్దు వెంట గురువారం ఈ ఘటన జరిగింది.

సరిహద్దు ఔట్‌పోస్ట్‌ వద్ద ఉన్న 50ఏళ్ల లాల్‌ఫామ్‌ కీమాపై కాల్పులు జరపడంతో రక్తమోడుతున్న ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం జమ్మూలోని జీఎంసీ ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ‘ పాక్‌ రేంజర్ల కాల్పులకు దీటుగా బీఎస్‌ఎఫ్‌ బలగాలు కాల్పుల మోత మోగించాయి. సమీపంలోని జెర్దా గ్రామంపైనా పాక్‌ రేంజర్లు కాల్పులు జరిపారు’ అని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement