దారుణం: 34 మంది విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా..

Boat Carrying 30 Children Capsizes In Bihar - Sakshi

ముజఫర్‌పూర్ జిల్లాలో దారుణం

భాగ్మతి నదిలో 34 మంది విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా

20 మందిని రక్షించిన సహాయక బృందాలు

కొనసాగుతున్న గాలింపు చర్యలు

పాట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. 34 మంది పాఠశాల విద్యార్థులతో భాగ్మతి నదిలో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. సహాయక బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి 20 మందిని రక్షించినట్లు చెప్పారు. మరో పద్నాలుగు మంది పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 

బెనియాబాద్ ప్రాంతంలోని పట్టి ఘాట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బిహార్ సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలవాలని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.  

 

ఈ ప్రమాద ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు నది వద్దకు చేరుకుని విలపిస్తున్నారు. అటు.. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 

ఇదీ చదవండి: Kerala Nipah Virus Cases: కేరళలో ఐదుకి చేరిన నిఫా కేసులు.. బాధితులతో 706 మంది డైరెక్ట్ కాంటాక్ట్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top