సామ్రాజ్య భారతి 1889/1947

Azadi Ka Amrit Mahotsav: Samrajya Bharati 1889 To 1947 - Sakshi

ఘట్టాలు
మోహన్‌ బగాన్‌ అథ్లెటిక్‌ క్లబ్‌ స్థాపన
కలకత్తాలో మోహన్‌ బగాన్‌ ఎ.సి. గా ప్రారంభమైన ఈ భారతీయ స్పోర్ట్స్‌ క్లబ్‌ జట్టు 1911లో బ్రిటిష్‌ వారి ‘ఈస్ట్‌ యార్క్‌షైర్‌ రిజిమెంట్‌’ జట్టుపై ఐ.ఎఫ్‌.ఎ. షీల్డ్‌ ఫైనల్స్‌లో గెలవడంతో ఆ విజయం చిరస్థాయిగా నిలిచిపోయింది. 

చట్టాలు
కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్, కమిషనర్స్‌ ఫర్‌ ఓత్స్‌ యాక్ట్, ఇంట్రప్రెటేషన్‌ యాక్ట్‌.

జననాలు
రాజకుమారి అమృత్‌కౌర్‌ : స్వాతంత్య్ర సమర యోధురాలు, సామాజిక కార్యకర్త, ఆరోగ్యశాఖ మంత్రి (లక్నో); డాక్టర్‌ కేశవ్‌ బలిరామ్‌ హెగ్గేవార్‌ : రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ వ్యవస్థాపకులు, సంఘ సంస్కర్త, రాజకీయ కార్యకర్త (నాగపూర్‌); జవహర్‌లాల్‌ నెహ్రూ : స్వతంత్ర భారత తొలి ప్రధాని, రాజనీతిజ్ఞులు (అలహాబాద్‌); జైశంకర్‌ ప్రసాద్‌ : హిందీ కవి (వారణాసి); సాధు సుందర్‌ సింగ్‌ : క్రైస్తవ మత ప్రబోధకులు (పాటియాలా); మీర్జా బహీరుద్దీన్‌ మహమూద్‌ అమ్మద్‌ : కలీఫా (పంజాబ్‌); మఖన్‌లాల్‌ చతుర్వేది : కవి, నాటకకర్త (మధ్యప్రదేశ్‌); కె.కేళప్పన్‌ : స్వాతంత్య్ర సమరయోధులు (కేరళ); సహజానంద సరస్వతి : జాతీయవాది, సాధువు (ఉత్తరప్రదేశ్‌); సహోదరన్‌ అయ్యప్పన్‌ : సంఘ సంస్కర్త, రాజకీయవేత్త (కేరళ); ఆచార్య రామ్‌లోచన్‌ శరణ్‌ : భాషాకోవిదులు (బిహార్‌); మెహర్‌ చంద్‌ మహాజన్‌ : భారత సుప్రీంకోర్టు మూడవ ప్రధాన న్యాయమూర్తి (పంజాబ్‌); పి.సుబ్బరాయన్‌ : ఫ్రీడమ్‌ ఫైటర్, మద్రాస్‌ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి (సేలం); బెనెగల్‌ రామారావ్‌ : ఆర్‌.బి.ఐ. నాల్గవ గవర్నర్‌ (మద్రాస్‌); ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య : స్వాతంత్య్రోద్యమ గాయకుడు, వక్త  (పెనుగంచిప్రోలు).

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top