పీఎం కిసాన్‌ అవార్డు అందుకున్న ‘అనంత’ కలెక్టర్‌

Anantapur Collector Received Prime Minister Kisan National Award - Sakshi

ఢిల్లీ : ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అందుకున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చేతుల మీదుగా బుధవారం ఆయన ఈ అవార్డును తీసుకున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డుకు అనంతపురం జిల్లా ఎంపికైన సంగతి తెలిసిందే.  రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని  కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో పీఎం కిసాన్‌ సమ్మన్‌ నిధి పథకం కింద రైతులకు రూ. 6వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తుంది. ఈ పథకం​ అమలులో అనంతపురం జిల్లా ముందు వరుసలో నిలిచింది.

కేంద్ర వ్యవసాయశాఖ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో 5శాతం మంది లబ్దిదారులకు సంబంధించి భౌతిక ధృవీకరణ చేశారు. అసలు వీరు పథకానికి అర్హులేనా? సరైన వివరాలే నమోదు చేశారా? అనే అంశాలను పరిశీలించారు. 2018 డిసెంబర్ 1న ప్రారంభించిన ఈ పథకం కింద జిల్లాలో మొత్తం 63 మండలాల్లో 28,505 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మరే జిల్లాలో లేని విధంగా లబ్ధిదారుల భౌతిక ధృవీకరణను 99.6 శాతం పూర్తి చేసింది. ఈ ఘనత సాధించడం పట్ల కేంద్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాను ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. 

చదవండి : (రూ.2.65 లక్షల టిడ్కో ఇల్లు ఒక్క రూపాయికే)
(భారీగా పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top