ఎయిర్‌ ఇండియా ఘటన: పశ్చాత్తాపం లేకుండా ఆరోపణలా!

Air India Urination: Women Reacts Instead Of Being Remorseful  - Sakshi

ఎయిర్‌ ఇండియా మూత్ర విసర్జన ఘటనలో నిందితుడు శంకర్‌ మిశ్రా మాటమార్చి బాధితురాలిపైనే సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సదరు వృద్ధ మహిళ ఆ వ్యాఖ్యలకు స్పందించి..అవన్నీ కల్పితాలంటూ కొట్టిపారేసింది. తాను చేసిన అనుచిత పనికి పశ్చాత్తాపం చెందకుండా తనపైనే ఆరోపణలా అంటూ మిశ్రాపై సీరియస్‌ అయ్యారు. తనకు ఎదురైన భయంకరమైన అనుభవం ఏ వ్యక్తి కూడా అనుభవించకుండా ఉండేలా సంస్థాగత మార్పులు జరిగేలా చూడటమే తన ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు.

తాను చేసిన అసహ్యకరమైన పనికి సిగ్గుపడకుండా తనపైన అసత్య ఆరోపణలు చేసి మరింత వేధిస్తున్నాడని వాపోయారు. కాగా నవంబర్‌ 26న ఎయిర్‌ ఇండియాలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటన సదరు బాధిత మహిళ ఫిర్యాదుతో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నిందితుడిని అరెస్టు చేయడం, కోర్టు నోటీసులు జారీ చేయడం తదితరాలు జరిగాయి. అంతేగాదు కోర్టు అతని కస్టడీని నిరాకరించి, బెయిల్‌ పిటీషన్‌ని సైతం తిరస్కరించింది. ఐతే కోర్టు నోటీసుల నిమిత్తం విచారణ చేయగా... నిందితుడు మిశ్రా వృద్ధురాలు అనారోగ్య కారణాల రీత్యా ఆమెనే మూత్ర విసర్జన చేసిందని ఆరోపణలు చేశాడు 

(చదవండి: ఎయిర్‌ ఇండియా ‘మూత్ర విసర్జన’ ఘటనలో కొత్త కోణం.. ‘నేను అసలు ఆ పని చేయలేదు’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top