కోవిడ్‌ వ్యాక్సిన్‌: రూ. 80 వేల కోట్లు ఉన్నాయా?!

Adar Poonawalla Asks Does Government Have 80000 Crore Covid Vaccine - Sakshi

సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ ఆదార్‌ పూణావాల

ముంబై: మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచమంతా వ్యాక్సిన్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మానవాళి మనుగడకు సవాలు విసురుతున్న కోవిడ్‌-19కు చెక్‌ పెట్టే దిశగా ఇప్పటికే పలు ఫార్మా దిగ్గజాలు టీకా రూపకల్పనలో మునిగిపోయాయి. ఈ క్రమంలో స్పుత్నిక్‌-వీ పేరిట​ కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయగా, ఆస్ట్రాజెనెకా, మోడర్నా తదితర కంపెనీల వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు చేరుకున్నాయి. అన్నీ సజావుగా సాగితే ఈ ఏడాది చివర్లోగా టీకా విడుదల గురించి ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ ప్రభావిత దేశాల్లో ఒకటైన భారత్‌.. వ్యాక్సిన్‌ కొనుగోలు, పంపిణీ మార్గదర్శకాలు తదితర విషయాల్లో ఎంత వరకు సన్నద్ధంగా ఉందన్న అంశంపై సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూణావాల కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: మార్కెట్లోకి రష్యా వ్యాక్సిన్‌)

ఈ మేరకు.. ‘‘వచ్చే ఏడాది కాలానికి గానూ 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఎందుకంటే, వాక్సిన్‌ కొనుగోలు చేసేందుకు, దేశంలోని ప్రతీ వ్యక్తికి దానిని పంచేందుకు ఆరోగ్య శాఖ ఈ మొత్తం అవసరం పడుతుంది. మనం తర్వాత ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు ఇదే’’అని ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశీయ, విదేశీ ఫార్మా కంపెనీలను సంప్రదించి టీకాను కొనుగోలు చేసే అంశంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించేందుకే తాను ఈ ప్రశ్న అడిగినట్లు పూణావాల పేర్కొన్నారు.

కాగా కరోనా వైరస్ నిరోధక వ్యాక్సిన్‌ రూపకల్పనలో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌  యూనివర్సిటీ- ఆస్ట్రాజెనెకాతో సీరం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. వాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరా బాధ్యతలు తీసుకుంది. ఈ క్రమంలో జూలై నెలలో పూణావాల మాట్లాడుతూ.. టీకా ధర వేయి రూపాయల వరకు ఉంటుందని వెల్లడించారు. అంతేగాక ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు ప్రభుత్వాలే ఉచితంగా వ్యాక్సిన్‌ అందించే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా..  భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 59 లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు నమోదు కాగా, 1,089 మరణాలు సంభవించాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

22-10-2020
Oct 22, 2020, 18:41 IST
సాక్షి,అమరావతి : ఏపీలో కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్‌...
22-10-2020
Oct 22, 2020, 18:37 IST
సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ విరుగుడును కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం...
22-10-2020
Oct 22, 2020, 17:50 IST
క‌మెడియ‌న్, న‌టుడు సుడిగాలి సుధీర్‌కు క‌రోనా సోకిందంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై సుధీర్ ఎలాంటి...
22-10-2020
Oct 22, 2020, 17:27 IST
కరోనా వైరస్‌ బారిన పడిన 28 ఏళ్ల బ్రెజీలియన్‌ యువ డాక్టర్‌ మరణంపై ప్రపంచ వ్యాప్తంగా రాద్ధాంతం చెలరేగుతోంది.
22-10-2020
Oct 22, 2020, 14:08 IST
రాజశేఖర్‌ ఆరోగ్యం కాస్త విషమంగా ఉందని గురువారం ఆయన కూతురు శివాత్మిక ట్వీట్‌ చేసింది
22-10-2020
Oct 22, 2020, 13:46 IST
సాక్షి,ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎన్‌సీపీ నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కోవిడ్-19...
22-10-2020
Oct 22, 2020, 13:30 IST
బ్రసిలియా:  చైనా  రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ను తమ ప్రభుత్వం కొనుగోలు చేయదని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో వెల్లడించారు. చైనా సినోవిక్‌...
22-10-2020
Oct 22, 2020, 10:05 IST
లండన్‌‌: కోవిడ్‌ చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ క్లినకల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి అనారోగ్యానికి...
22-10-2020
Oct 22, 2020, 09:45 IST
న్యూఢిల్లీ : భారత్‌లో గడిచిన 24 గంటల్లో 55,838 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,06,946కి చేరింది....
22-10-2020
Oct 22, 2020, 04:45 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒకేరోజు 4,739 మంది కోలుకోవడంతో ఇప్పటి...
21-10-2020
Oct 21, 2020, 20:05 IST
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభణ తీవ్రంగా ఉన్న అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తలు...
21-10-2020
Oct 21, 2020, 17:59 IST
సాక్షి, అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 74,422 మందికి కరోనా  నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 3,746 మందికి కోవిడ్‌...
21-10-2020
Oct 21, 2020, 17:02 IST
లండన్‌ : ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ భయాందోళనలకు గురిచేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు నేడు...
21-10-2020
Oct 21, 2020, 13:27 IST
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులను తగ్గించటంలో విజయం సాధించామని, కరోనాతో మృత్యువాత పడేవారి సంఖ్య...
21-10-2020
Oct 21, 2020, 11:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి, లాక్ డౌన్ నిబంధనలతో టెక్ సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు,...
21-10-2020
Oct 21, 2020, 10:20 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 76 లక్షల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో 54,044 కరోనా కేసులు నమోదయ్యాయి....
21-10-2020
Oct 21, 2020, 10:14 IST
సాక్షి, చెన్నై: పండుగ సీజన్ రావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో షాపింగ్ సందడి నెలకొంది.  ముఖ్యంగా కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షలతో...
21-10-2020
Oct 21, 2020, 04:18 IST
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల రోజుకు 60 వేల నుంచి 90 వేల వరకూ కేసులు బయట పడిన సంగతి తెలిసిందే....
21-10-2020
Oct 21, 2020, 03:21 IST
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్‌ డెస్కులు ఉండాలి. 15 రోజుల్లో ఈ ఏర్పాటు జరిగి తీరాలి. ప్రతి హెల్ప్‌...
21-10-2020
Oct 21, 2020, 03:08 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ ఎవరెవరికి ఇవ్వాలో పేర్లతో జాబితా తయారు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ,...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top