అలంపూర్: జోగుళాంబదేవి శరన్నవరాత్రి ఉ త్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించినట్లు అలంపూర్ క్షేత్ర ఆలయాల ఈఓ దీప్తి తెలిపారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హన్మంతురావు, ఈఓ దీప్తి, గద్వాల సంస్థాన వారసులు కృష్ణ రాంభూపాల్ శుక్రవారం కలిశారు. ఆదివారం నుంచి జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాలకు సీఎంను ఆహ్వానించినట్లు చెప్పారు. అలాగే జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివారి జ్ఞాపికను సీఎంకు అందజేశారు.
రేపు జిల్లాస్థాయి
ఖో–ఖో జట్ల ఎంపికలు
మరికల్: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం జిల్లాస్థాయి బాల, బాలికల ఖో–ఖో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పీడీ వెంకటేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఆధార్‌కా ర్డు, బోనోఫైడ్ ధ్రువపత్రాలతో హాజరుకావా లని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 15 నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతానికి కృషి
కోస్గి రూరల్: కొడంగల్ నియోజకవర్గంలో మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మార్కెటింగ్ అదనపు సంచాలకుడు రవికుమార్, అదనపు జాయింట్ డైరెక్టర్ మల్లేషం అన్నారు. శుక్రవారం కోస్గిలోని మా ర్కెట్‌యార్ఢు ఆవరణలో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, రైతులు, ఎఫ్‌పీఓలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక మార్కెట్‌యార్డుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. రూ.4. 50 కోట్లతో మార్కెట్‌యార్డు భవన నిర్మాణం, కవర్‌షెడ్, ఆవరణలో సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గ రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను ప్రస్తుతం మహబూబ్‌నగర్, జడ్చర్ల, పరిగి, తాండూర్, నారాయణపేట ప్రాంతాలకు తరలించి విక్రయిస్తుండటంతో రవాణా ఖర్చులు భారమవుతున్నాయని.. సమస్య పరిష్కారానికి కోస్గి మార్కెట్‌యార్డును ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస మౌలిక వసతులు కల్పించడంతో పాటు సీసీ కెమెరాలు, ఆర్వోప్లాంట్, మురుగుడొడ్లు, వే బ్రిడ్జి, ఆధునాతన షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని వివరించారు. వారి వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి బాలమణి, మార్కెట్‌యార్డు కార్య దర్శి రాములు, ట్రేడర్లు వీరన్న, లింగమయ్య, మార్కెట్ సిబ్బంది ఉన్నారు.


