నారాయణపేట: తరతరాలుగా వస్తున్న నారాయణపేట చేనేత కళ కు పూర్వ వైభవం తీసుకొచ్చి నేత కార్మి కుల జీవన ప్రమాణాల మెరుగుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తెలిపా రు. శుక్రవారం పట్టణంలోని మూ ల హనుమాన్ మందిరం సమీపంలో ఉన్న ఘనశ్యామ్ సరోదే లూ మ్స్‌ను ఆమె సందర్శించారు. చేనేత కార్మికుల నైపుణ్యాభివృద్ధి, చీరల నాణ్యత పెంపు, మార్కెటింగ్ అవకాశాల విస్తరణ లక్ష్యంగా నాబార్డు ద్వారా రూ.8 లక్షలు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధులతో 60 మంది చేనేత కార్మికులకు 40 రోజుల పాటు ప్రత్యేక ఇకత్ నేత శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. శిక్షణ కార్యక్రమం అమలు, చేనేత ఉత్పత్తుల నాణ్యత మెరుగు, కొత్త డిజైన్ల రూపకల్పన, మార్కెటింగ్ అవకాశాలపై సంబంధిత ప్రతినిధులతో చర్చించారు. సంప్రదాయ నేతకు ప్రసిద్ధి చెందిన నారాయణపేట చీరలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని, జీఐ ట్యాగ్ కూడా సాధించాయని పేర్కొన్నారు. అయితే మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా మహిళా సమాఖ్య కలెక్టర్ సహకారంతో నాబార్డ్‌కు సమర్పించిన ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో శిక్షణ కార్యక్రమానికి నిధులు సమకూరాయన్నారు. ఘనశ్యామ్ సరోదే ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ శిక్షణలో ఆధునిక నేత పద్ధతులు, నూతన డిజైన్లు, కలంకారి డిజైన్లు, నాణ్యత పెంపు, మార్కెటింగ్ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. తద్వారా కార్మికుల నైపుణ్యాలు పెరిగి వారి ఆదాయానికి మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


