పరిశ్రమల అనుమతుల్లో జాప్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల అనుమతుల్లో జాప్యం వద్దు

Oct 10 2026 1:22 AM | Updated on Oct 10 2026 1:22 AM

నారాయణపేట: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ, టీఎస్‌–ఐపాస్‌ నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులు, వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులు, పారిశ్రామికవేత్తలకు అందించాల్సిన సేవలపై సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను నిర్దేశిత గడువులోగా మంజూరు చేయాలని సూచించారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను గుర్తించి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వ శాఖల నుంచి అందాల్సిన సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించాలని పేర్కొన్నారు. అనుమతులు, ధ్రువపత్రాల జారీలో ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించి, పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎస్సీ ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించి 16, ఎస్టీ ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించి 5 యూనిట్లు మంజూరైనట్లు అదనపు కలెక్టర్‌ వెల్లడించారు. జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ రామలింగేశ్వర్‌గౌడ్‌, డీఆర్డీఓ వెంకట్రాములు, ఎల్‌డీఎం సురే ష్‌ ఆత్రేయ, ఏఎంవీఐ సాయితేజ్‌రెడ్డి, అటవీశాఖ అధికారి రమేష్‌రెడ్డి, పుర కమిషనర్‌ శంకర్‌, విద్యుత్‌శాఖ అధికారి రాజునాయక్‌, ఏసీటీఓ సునీల్‌ సచిన్‌న్‌, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement