అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధాలు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధాలు

Jun 23 2026 2:22 AM | Updated on Jun 23 2026 2:22 AM

కందనూలు: కాంగ్రెస్‌ ప్రభుత్వం చే స్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్‌ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డి కావడాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, నల్లమల ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని, నల్లమల పౌరుషం, శౌర్యం రేవంత్‌రెడ్డి సొంతం అని మంత్రి అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల కాలంలో పది లక్షల ఇళ్లు ఇవ్వలేక పోయిందని, కేవలం వాళ్ల దృష్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలనే ఆలోచనలో మాత్రమే ఉన్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, బిజెపి పార్టీలు సీఎం రేవంత్‌రెడ్డిని వ్యక్తిగత హననానికి పాల్పడేలా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. అబద్ధానికి ఆరడుగుల అర్థం హరీశ్‌రావు అని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు కాంగ్రెస్‌, బీజేపీలకు కనబడడం లేదని, మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కక్కటీ నెరవేర్చుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులు చేసి.. నెలకు రూ.4వేల కోట్లు వడ్డీ బకాయిలు పెట్టింది, కేసీఆర్‌ పాలనలో అభివృద్ధి కంటే అప్పులే పెరిగాయన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావులు కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకుంటున్నారని..రెండేళ్లలో రికార్డుస్థాయిలో పంటలు దిగుబడి వచ్చాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement