నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు ప్రాధాన్యతనిస్తూ.. ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణింధర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 21 అర్జీలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అదనపు కలెక్టర్ నేరుగా తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన అర్జీలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కార మార్గం చూపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు.
● జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ ఫణిందర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో విశిష్ట పాత్ర పోషించారన్నారు. పార్టీలకు అతీతంగా గౌరవం పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం గౌరవకరమైన విషయమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, డీఆర్డీఓ మొగులప్ప, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, డీపీఆర్‌ఓ రషీద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, హౌసింగ్ పీడీ శంకర్‌నాయక్, డీపీఓ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


