రక్షణ కంచె ఏర్పాటు చేయాలి.. | - | Sakshi
Sakshi News home page

రక్షణ కంచె ఏర్పాటు చేయాలి..

Mar 3 2026 9:14 AM | Updated on Mar 3 2026 9:14 AM

గుంటిపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలోని జూరాల కాల్వ వద్ద తరచుగా ప్రజ లు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నీటి ప్రవాహంపై అవగాహన లేక ఎంతో మంది కాల్వలో కొట్టుకుపోయి మృతిచెందడం విచారకరం. మరోమారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రాజెక్టు అధికారులు కాల్వ వెంట ఉన్న మెట్ల వద్ద రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. – వెంకటేశ్‌, నందిమళ్ల

అవగాహన కల్పిస్తున్నాం..

జూరాల ప్రాజెక్టు నుంచి రామన్‌పాడ్‌ రిజర్వాయర్‌ వరకు ఉన్న ప్రధాన ఎడమ కాల్వ వెంట నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. వారబందితో సంబంధం లేకుండా కాల్వకు నీటిని నిరంతరం అందిస్తుంటారు. వారబంది రోజుల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుందని సమీప ప్రాంతాల యువకులు, చిన్నారులు ఈత కోసం కాల్వను ఆశ్రయిస్తుంటారు. కాల్వలోని నాచు అధికంగా ఉండటంతో కాలుజారి కాల్వలో గల్లంతై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనిపై ఆయా గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

– శివకుమార్‌, సీఐ, ఆత్మకూరు

నీటి ప్రవాహాన్ని తెలియజేయాలి..

జూరాల ఎడమ కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని ప్రాజెక్టు అధికారులు సిబ్బంది ద్వారా సమీపంలోని గ్రామాల ప్రజలకు తెలియజేయాలి. వారాబంది ద్వారా ఎన్ని రోజులు నీటిని అధికంగా వదులుతారు.. ఎన్ని రోజులు నీటిని నిలిపివేస్తారనే విషయాలను అక్కడి రైతులతో పాటు ప్రజలకు వివరిస్తే ప్రాణ హానిని నివారించవచ్చు. – హన్మంతు, మాజీ ఎంపీటీసీ, నందిమళ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement