ఇదేమీ ప్రభుత్వ అయ్యా.. పంటలు కోతకొచ్చే సమయం దగ్గర పడుతున్నా రైతు భరోసా ఇవ్వడం లేదు. యాసంగికి ముందే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామన్న ప్రభుత్వం నేటికీ వేయలేదు. అప్పులు చేసి పంట పెట్టుబడులు పెడుతున్నాం. ఇంతవరకే రెండుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టారు. ఇప్పుడు ఎగ్గొడితే మూడోసారి అవుతుంది.
– వెంకటయ్య, రైతు, మరికల్
ఊసెత్తడం లేదు..
యాసంగి ముగుస్తున్నా పెట్టుబడి సాయంపై ప్రభుత్వం ఊసెత్తడం లేదు. నాలుగెకరాల పొలంలో వరిపంట సాగుకు పెట్టుబడి రూ.లక్ష దాటింది. రైతులకు అనుకూలమైన సమయంలో రైతు భరోసా ఇవ్వకుంటే తీవ్రంగా నష్టపోయ్యే పరిస్థితి ఉంది. పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు పెట్టుబడి సాయం అందించాలి.
నాగేష్, రైతు, పసుపుల, మక్తల్ మండలం
ప్రభుత్వ నిర్ణయం మేరకే..
జిల్లాలో సుమారు 1.80 లక్షల మంది రైతుభరోసా పథకానికి అర్హులుగా ఉన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే అర్హులందరి బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ అవుతుంది.. రైతులు ఆందోళన చెందొద్దు.
– జాన్ సుధాకర్, డీఏఓ
●


