శ్రీశైల దేవస్థానానికి రూ.4 లక్షల విరాళాలు | - | Sakshi
Sakshi News home page

శ్రీశైల దేవస్థానానికి రూ.4 లక్షల విరాళాలు

Jul 10 2026 7:52 AM | Updated on Jul 10 2026 7:52 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి గురువారం విజయవాడకు చెందిన హరినాథబాబు పోలినేడి వెంకట సుబ్బయ్య పేరుతో రూ.1,00,170 విరాళాన్ని, అలాగే పోలినేడి నాగమణి పేరుతో రూ.1,00,070 విరాళాన్ని దేవస్థాన పర్యవేక్షకులు టి .హిమబిందుకు అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన కె.శంకర్‌ రూ.1,00,016, హైదరాబాద్‌ చెందిన టి. వెంకటరావు రూ. 1,00,016 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివ ప్రసాద్‌కు అందజేశారు. విరాళాలను అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామి వారి శేష వస్త్రా న్ని, లడ్డు ప్రసాదాలను, జ్ఞాపికను, రసీదును అందజేసి సత్కరించారు.

ఆదోని, నంద్యాల మార్కెట్‌ కమిటీలకు కొత్త సెక్రటరీలు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలోని ఆదోని, నంద్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు నూతన సెక్రటరీలు నియమితులయ్యారు. రాష్ట్రంలోని వివిధ మార్కెట్‌ కమిటీల్లో స్పెషల్‌ గ్రేడ్‌ సెక్రటరీలుగా పనిచేస్తున్న 10 మందికి ఎంపిక శ్రేణి (సెలక్షన్‌ గ్రేడ్‌)సెక్రటరీలుగా పదోన్నతి కల్పిస్తూ వ్యవసాయ, అనుబంధ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ జీవో 623 జారీ చేశారు. ఎమ్మిగనూరు మార్కెట్‌ కమిటీలో స్పెషల్‌ గ్రేడ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న జి.చంద్రమౌళికి స్పెషల్‌ గ్రేడ్‌ సెక్రటరీగా పదోన్నతి కల్పించి కొత్తపేట మార్కెట్‌ కమిటీ సెక్రటరీగా నియమించారు. మాచర్ల మార్కెట్‌ కమిటీలో స్పెషల్‌ గ్రేడ్‌ సెక్రటరీగా పని చేస్తున్న ఎస్‌.సీతారామయ్యకు పదోన్నతి కల్పించి ఆదోని మార్కెట్‌ సెక్రటరీగా నియమించారు. వినుకొండ మార్కెట్‌ కమిటీ స్పెషల్‌ గ్రేడ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న బీవీఆర్‌ కృష్ణనాయక్‌కు పదోన్నతి కల్పించి ఇచ్చాపురం మార్కెట్‌ కమిటీ సెక్రటరీగా నియమించి.. అక్కడి నుంచి డిప్యుటేషన్‌పై నంద్యాల మార్కెట్‌ కమిటీ సెక్రటరీగా బదిలీ చేశారు.

కోవిడ్‌కు ముందస్తు ఏర్పాట్లు

కర్నూలు(హాస్పిటల్‌): కోవిడ్‌ కేసులు వస్తే అవసరమైన ఏర్పాట్లను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో కోవిడ్‌తో ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై తగిన ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పల్మనాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ఈఎన్‌టీ, మైక్రోబయాలజీ విభాగాల వైద్యుల సహకారంతో కమిటీని నియ మించారు. ఆసుపత్రికి కోవిడ్‌ లక్షణాలతో ఎవ్వరైనా వస్తే వెంటనే వారిని వైద్యపరీక్షల నిమిత్తం మైక్రోబయాలజీకి పంపించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement